
ప్రజలు ఇటీవల కాలంలో నగదు విత్ డ్రాకు ఏటీఎంలను వాడతున్నారు. ఏటీఎంలు ద్వారా చిన్న మొత్తాల్లో సొమ్ము తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండడం లేదు. అయితే ఇటీవల కాలంలో ఏటీఎం కార్డుల ద్వారా మోసాలు పెరుగుతున్నాయి. ఈ మోసాలకు చిన్న టిప్‌తో చెక్ పెట్టవచ్చని ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. ఏటీఎం లావాదేవీకు ముందు రెండుసార్లు క్యాన్సిల్ బటన్ నొక్కితే ఎవరైనా మన లావాదేవీకు ముందు మన పిన్ కనుగొడానికి సెటప్ చేసి ఉంటే అది క్యాన్సిల్ అవుతుంది. అలాగే తర్వాత మన కార్డును ఉపయోగించి మోసాలు చేయలేరని ఆర్‌బీఐ అధికారులు చెప్పారంటూ వార్త వైరల్‌గా మారింది. దీంతో చాలా మంది ఇది నిజమనుకుని ఏటీఎం సెంటర్లలో ఈ విధంగా చేస్తున్నారు. ఆర్‌బీఐ పేరుతో నకిలీ వార్తను ప్రచారం చేయడంతో ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ వార్త నకిలీ అంటూ పీఐపీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.
A post falsely attributed to @RBI claims that pressing ‘cancel’ twice on an ATM before a transaction can prevent PIN theft#PIBFactCheck
ఇవి కూడా చదవండి❌This statement is FAKE & has NOT been issued by RBI
✔️Keep transactions secure
✅Conduct fund transfer in private
✅Conduct fund… pic.twitter.com/hTT64E5bVa
— PIB Fact Check (@PIBFactCheck) May 6, 2025
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినట్లు చెప్పుకునే సందేశాలు మీకు వస్తే వాటిని నమ్మే లేదా షేర్ చేసే ముందు వాటి ప్రామాణికతను ధ్రువీకరించడం చాలా అవసరం. సమాచారం నిజమో కాదో తెలుసుకోవడానికి మీరు 87997 11259 కు వాట్సాప్‌కు సందేశం పంపవచ్చు లేదా మీ ప్రశ్నను pibfactcheck@gmail.com కు ఈ-మెయిల్ చేయవచ్చు. అదనంగా ధ్రువీకరించబడిన వాస్తవ తనిఖీ నవీకరణలు pib.gov.in లోని అధికారిక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఛానెల్‌లు పౌరులు తప్పుడు సమాచారం నుండి రక్షించడానికి, వారు విశ్వసనీయ వనరులపై మాత్రమే ఆధారపడతారని నిర్ధారించుకోవడానికి సహాయపడతాయి.
ఈ వార్త ఆన్‌లైన్‌లో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. 2022లో మరియు గత సంవత్సరం కూడా ఇలాంటి సందేశాలు వ్యాపించాయి. ఈ రెండింటినీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) వాస్తవ తనిఖీ బృందం తోసిపుచ్చింది. ఏటీెం పిన్ దొంగతనం నుండి మిమ్మల్ని మీరు నిజంగా రక్షించుకోవడానికి, నిపుణులు ఆచరణాత్మక భద్రతా చర్యలను అనుసరించమని సిఫార్సు చేస్తున్నారు. మీ పిన్‌ను నమోదు చేసేటప్పుడు ఎల్లప్పుడూ కీప్యాడ్‌ను కవర్ చేయాలి. అలాగే బాగా సురక్షితమైన ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలను ఉపయోగించాలి. ఏటీఎంలో ఏవైనా అనుమానాస్పద పరికరాలు లేదా ట్యాంపరింగ్ కోసం యంత్రాన్ని తనిఖీ చేయాలి. అదనంగా లావాదేవీ హెచ్చరికలను ప్రారంభించడం, మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ ఉంటే మోసాల నుంచి బయటపడవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి