Anand Mahindra: దిగ్గజ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ఒక్కసారిగా అలా నాటి జ్ఞాపకాల్లోకి(Memories) వెళ్లారు. పూర్వం విమాన ప్రయాణానికి సంబంధించిన విషయాలను నెమరు వేసుకున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా టాటా గ్రూప్(Tata Group) కు చిన్నపాటి విన్నపాన్ని చేశారు. ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా.. తాజాగా 1949లో అప్పటి బాంబే ఎయిర్ పోర్ట్ కి సంబంధించి ప్రయాణికులు బయల్దేరే లాంజ్‌కి సంబంధించిన పాత ఫోటో ఒకదానిని షేర్ చేశారు. ఆ రోజుల్లో విమాన ప్రయాణంలో హడావుడి ఉండేది కాదని ట్వీట్ లో ప్రస్తావించారు.
కేవలం కామెంట్లు మాత్రం పెట్టి వదిలేయని ఆయన.. ఆ పాతకాలానికి చెందిన ప్యాసింజర్ డిపార్చర్ లాంజ్ ఫోటోను షేర్ చేశారు. ముంబై ఎయిర్‌పోర్టులో ఏదైనా స్థలంలో టాటాలు దీనిని పునరుద్ధరిస్తారేమో అంటూ తన మనసులోని మాటను బయట పెట్టారు. ఇలా చేస్తే అదొక టూరిస్ట్ ఎట్రాక‌్షన్ సెంటర్‌గా కూడా మారే అవకాశం ఉందని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్‌లైన్స్ టాటాల ఆధీనంలో ఉన్నందున ఆనంద్ మహీంద్రా ఈ విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందిస్తున్న నెటిజెన్లు ఈ రోజుల్లో విమాన ప్రయాణం ఒత్తిడిని కలిగి ఉంటోందని.. ఇది మంచి ఆలోచన అంటూ అనేక మంది తమ మనసులోని అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
Now THAT was when air travel was unhurried and laid-back. Maybe TATA can resurrect this charming lounge somewhere in Mumbai Airport as a tourist attraction… pic.twitter.com/swzs3VDhbS
— anand mahindra (@anandmahindra) April 16, 2022
ఇవీ చదవండి..
Electric Scooters: దేశంలో తొలిసారిగా ఈ-స్కూటర్ల రీకాల్.. వాహనాలను వెనక్కి రప్పించనున్న కంపెనీ
Moto G52: భారత్‌లో త్వరలో Motorola ‘G’ సిరీస్ కొత్త ఫోన్ లాంచింగ్.. ఫీచర్స్ ఇవే