మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.. లక్షల్లో సంపాదన!

|

Apr 24, 2024 | 6:13 PM

9 టూ 6 జాబ్స్‌పై ఇప్పుడు చాలామంది విసిగిపోయారా.? వర్క్ ప్రెజర్, ఒత్తిడి తదితర కారణాల వల్ల సొంతంగా ఏదైనా స్టార్టప్ లేదా ఇంట్లో నుంచే కాలు కదపకుండా చిన్నపాటి వ్యాపారం ఏదైనా మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు వేసవికాలం నడుస్తోంది కాబట్టి.. ఓ వ్యాపారం..

మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.. లక్షల్లో సంపాదన!
Money
Follow us on

9 టూ 6 జాబ్స్‌పై ఇప్పుడు చాలామంది విసిగిపోయారా.? వర్క్ ప్రెజర్, ఒత్తిడి తదితర కారణాల వల్ల సొంతంగా ఏదైనా స్టార్టప్ లేదా ఇంట్లో నుంచే కాలు కదపకుండా చిన్నపాటి వ్యాపారం ఏదైనా మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు వేసవికాలం నడుస్తోంది కాబట్టి.. ఓ వ్యాపారం మంచి లాభసాటిగా సాగుతుంది. తక్కువ పెట్టుబడితో.. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే.. మాంచి లాభాలు ఆర్జించవచ్చు. ప్రస్తుతం బిజీబిజీగా మారిన జీవనశైలికి అనుగుణంగా చాలామంది ఇన్‌స్టాంట్ పచ్చళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ పచ్చళ్ల వ్యాపారానికి సమ్మర్ చాలా బెస్ట్ ఆప్షన్. మామిడికాయలకు ఇది బెస్ట్ సీజన్.. ఇక వాటితో తయారయ్యే పలు రకాల పచ్చళ్లు.. ఇప్పుడు మంచి లాభాలు తెచ్చిపెడతాయి. అరకేజీ రూ. 500 నుంచి కేజీ రూ. వెయ్యి వరకు వీటిని అమ్మవచ్చు.

అలాగే ఇడ్లీ కారం, కారంపొడి, కూర పొడి లాంటివి.. అటు నాన్ వెజ్ పచ్చళ్లకు ఇప్పుడు గిరాకీ ఎక్కువ. ప్రస్తుతం చికెన్ పచ్చడిని అరకేజీ రూ. 800కి అమ్ముతుంటే.. మటన్ పచ్చడి అరకేజీ దాదాపుగా రూ. 1200 పలుకుతోంది. అటు చేపల పచ్చడి రూ. 700, రొయ్యల పచ్చడి రూ. 1800 వరకు అరకేజీ అమ్ముతున్నారు. క్వాలిటీ, క్వాంటిటీ మనం ఎప్పుడూ సరిగ్గా మైంటైన్ చేస్తూ.. ఈ పచ్చళ్ల బిజినెస్ ద్వారా మంచి లాభాలు తెచ్చుకోవచ్చు. మీ ఇంటి దగ్గరలోని హోల్‌సేల్ షాపుల్లో మంచి ధరకు ఈ పచ్చళ్లను అమ్మవచ్చు. అలాగే మీకు ప్రతీ నెలా ముడిసరుకుకు అయ్యే ఖర్చు తీయగా.. దాదాపు నెలకు రూ. 50 నుంచి 65 వేల వరకు సంపాదించవచ్చు అని అంచనా..! ఈ బిజినెస్ స్టార్ట్ చేసేందుకు మొదటిగా రూ. 10 వేలు పెట్టుబడి పెడితే చాలు.. లేట్ ఎందుకు ఓసారి మీరూ ప్రయత్నించండి. ఈ బిజినెస్ మరీ ముఖ్యంగా మహిళలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.