Vodafone Prepaid Plan: వోడాఫోన్ తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎంపిక చేసిన ప్లాన్ పై ఉచితంగా 50 జీబీ డేటాను అందించనున్నట్లు ప్రకటిచింది. రూ.2,595 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను స్వీకరించే వినియోగదారులకు అదనంగా 50 జీబీ డేటాను అందించనుంది. ఈ ప్లాన్‌తో ప్రతిరోజు 2 జీబీ డేటాను అందించనుంది. దీంతో వినియోగదారులకు మొత్తం 730 జీబీ డేటా అందించనున్నారు. ఇందులో ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. వోడాఫోన్ రూ.2,595 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్ సదుపాయం, ప్రతి రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు, ఒక సంవత్సరం z5 సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది. వోడాఫోన్ వార్షిక ప్రీపెయిడ్ వ్యాలిడిటీ 365 రోజులు.