Budget 2026: వారికి గుడ్ న్యూస్.. బడ్జెట్‌లో తగ్గిన, పెరిగిన వస్తువుల ధరలు ఇవే..

లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. వికసిత్‌ భారత్‌ థీమ్‌గా బడ్జెట్‌ ఉందన్నారు. సంస్కరణల ఎక్స్‌ప్రెస్ మాదిరిగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఉపాధి, వృద్ధిని ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం ఎంతో చేసిందని నిర్మలా సీతారామన్‌ అన్నారు. 2025లో 350కి పైగా సంస్కరణలు ప్రారంభించినట్లు చెప్పారు.

Budget 2026: వారికి గుడ్ న్యూస్.. బడ్జెట్‌లో తగ్గిన, పెరిగిన వస్తువుల ధరలు ఇవే..
Budget 2026

Updated on: Feb 01, 2026 | 1:03 PM

లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. వికసిత్‌ భారత్‌ థీమ్‌గా బడ్జెట్‌ ఉందన్నారు. సంస్కరణల ఎక్స్‌ప్రెస్ మాదిరిగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఉపాధి, వృద్ధిని ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం ఎంతో చేసిందని నిర్మలా సీతారామన్‌ అన్నారు. 2025లో 350కి పైగా సంస్కరణలు ప్రారంభించినట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్.. మూలధన వ్యయం రూ.12.20 లక్షల కోట్లు.. కాగా.. 2026-27 ద్రవ్యలోటు 4.3 శాతంగా అంచనా వేశారు. 2027లో రూ.28.70 లక్షల కోట్ల పన్ను వసూళ్లు అంచనా వేశారు. కొన్ని వస్తువులకు పన్నుల మినహాయింపులు, తగ్గింపును ప్రకటించారు. దీంతో పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయి. మరికొన్ని వస్తువుల ధరలు మాత్రం మరింత పెరగనున్నాయి.

తగ్గనున్న ధరలు ఇవే..

సోలార్‌, లెదర్‌ ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి.

బీడీలు, బ్యాటరీలపై ధరలు తగ్గనున్నాయి.

సీఎన్‌జీ, బయోగ్యాస్‌ ధరలు తగ్గనున్నాయి.

క్యాన్సర్‌, షుగర్‌ మందుల ధరలు తగ్గనున్నాయి.

షూస్, దుస్తుల ఎగుమతి

7 తీవ్రమైన వ్యాధులకు మందులు

మత్స్యకారులకు ఎగుమతులు చౌకగా ఉంటాయి.

విమాన పరికరాల ధరలు

విదేశాల్లో చదువుకోవడం, విదేశీ ప్రయాణం ధరలు తగ్గనున్నాయి. చదువులు, వైద్యంపై TCS 5% నుంచి 2% తగ్గించారు.

పెరగనున్న ధరలు ఇవే..

ఫార్వర్డ్ ట్రేడింగ్

ఖనిజాలు

స్క్రాప్

మద్యం, సిగరేట్లు

బడ్జెట్ ఎలా ఉంది..

Loading...
Unable to load recommendations.
Follow Us