ఇది కదా శుభవార్త అంటే.. ఇక చీప్‌గానే మొబైల్ ఫోన్స్, ఛార్జర్లు.. భారీగా తగ్గనున్న ధరలు..

|

Jul 23, 2024 | 2:55 PM

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సాంకేతిక రంగానికి పెద్దపీట వేశారు. మొబైల్ ఫోన్లు, మొబైల్ PCBAలు, మొబైల్ ఛార్జర్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించారు. ఎంత తగ్గించారు? దీనిపై ఆర్థిక మంత్రి చెప్పిన విషయాలేంటి..? అని పూర్తి వివరాలు తెలుసుకోండి..

ఇది కదా శుభవార్త అంటే.. ఇక చీప్‌గానే మొబైల్ ఫోన్స్, ఛార్జర్లు.. భారీగా తగ్గనున్న ధరలు..
Mobile Phone
Follow us on

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ 2024-25 బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.. బడ్జెట్‌లో ముఖ్యమైన ప్రాజెక్టులకు, జనరల్‌ కేటగిరీకి ఎక్కువ గ్రాంట్లు కేటాయించింది.. వ్యవసాయం, మహిళలు, పరిశ్రమలు, రైల్వేలు మొదలైన అనేక రంగాలకు ఊతమిచ్చేందుకు భారీగా నిధులు సమకూర్చింది.. దీనికి తోడు టెక్నాలజీకి మరిన్ని మినహాయింపులు ఇచ్చింది.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన బడ్జెట్‌లో సాంకేతిక రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీబీఏలు, మొబైల్ ఛార్జర్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. గత 6 సంవత్సరాలలో దేశీయ ఉత్పత్తి మూడు రెట్లు పెరిగింది.. దీంతోపాటు మొబైల్ ఫోన్ల ఎగుమతి 100 రెట్లు పెరిగింది. ఈ క్రమంలో మొబైల్ ఫోన్లు, మొబైల్ PCBAలు, మొబైల్ ఛార్జర్లపై దిగుమతి సుంకాన్ని 15శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

బడ్జెట్ ప్రసంగంలో దీనిపై మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. గత ఆరేళ్లలో దేశీయంగా ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందని, మొబైల్ ఫోన్ల ఎగుమతి 100 రెట్లు పెరిగిందని చెప్పారు. భారతీయ మొబైల్ పరిశ్రమ బాగా పెరిగిందన్నారు. వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీబీఏ, మొబైల్ ఛార్జర్లపై బీసీడీ (బేసిక్ కస్టమ్స్ డ్యూటీ)ని 15 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించిన పలు విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని 15% నుంచి 10%కి తగ్గించింది. దేశీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో విలువను పెంచేందుకు మొబైల్ ఫోన్లు, మొబైల్ పిసిబిఎ, మొబైల్ ఛార్జర్లపై బిసిడిని తగ్గించినట్లు ఆమె తెలిపారు.

దిగుమతి సుంకాన్ని తగ్గించడానికి, విదేశీ మార్కెట్లలో భారతీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను ఆకర్షించడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు హ్యాండ్‌సెట్, ఎలక్ట్రానిక్స్ తయారీదారులు పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..