విద్యుత్ శ్రేణి వాహనాలకు మన దేశంలో గిరాకీ బాగా ఉంది. గతేడాది అత్యధికంగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్ముడుపోవడమే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. దీనిని అందిపుచ్చుకునేందుకు అన్ని కంపెనీలు 2024లో తమ ఉత్పత్తులను మన దేశంలో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రివర్ కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండీ కి సంబంధించిన బుకింగ్‌లను తిరిగి ప్రారంభించింది. కేవలం రూ. 2,500 టోకెన్ మొత్తంతో ఆన్‌లైన్ లేదా బెంగళూరులో ఇటీవల కొత్తగా ప్రారంభించిన డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర గతంలో కంటే రూ. 18,000 పెరిగి, ప్రస్తుతం రూ. 1.88లక్షలు(ఎక్స్ షోరూం)తో ప్రారంభమవుతోంది. ఈ స్కూటర్లో ఇండీ 6.7కేడబ్ల్యూహెచ్ మోటారు ఉంటుంది. దీనిలోని బ్యాటరీని పూర్తి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. ఛార్జింగ్ ఎంపికలలో 800-వాట్ పోర్టబుల్ ఛార్జర్, ఫాస్ట్ ఛార్జర్ ఉన్నాయి, 55 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది, ఇందులో సీటు కింద 43 లీటర్లు, గ్లోవ్‌బాక్స్ అప్-ఫ్రంట్‌లో 12 లీటర్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రివర్ కంపెనీ బెంగళూరు ఆధారిత స్టార్టప్. దీనిని 2021లో స్థాపించారు. 2023 ఫిబ్రవరిలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ది ఇండీని విడుదల చేసింది. రివర్ ఇండీని 2023 ఆగస్టులో హోస్కోట్‌లోని తయారీ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభించింది. బుకింగ్స్ సైతం చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల బుకింగ్‌లు నిలిపివేసింది. 2023 అక్టోబర్‌లో ముందుగా బుక్ చేసుకున్న చివరి బ్యాచ్ స్కూటర్‌లు డెలివరీ చేసేసింది. అయితే ఈ స్కూటర్‌ను మళ్లీ తయారు చేసేందుకు రివర్ కంపెనీ సమాయత్తమైంది. ఈ క్రమంలోనే బుకింగ్స్‌ను మళ్లీ ప్రారంభించింది.
స్కూటర్లో ఇండీ 6.7కేడబ్ల్యూహెచ్ మోటారు ఉంటుంది. దీనిలో అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఇచ్చారు. సింగిల్ చార్జ్ పై 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈస్కూటర్ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక బ్యాటరీ ఛార్జింగ్ ఎంపికలలో 800-వాట్ పోర్టబుల్ ఛార్జర్, ఫాస్ట్ ఛార్జర్లు ఉంటాయి. రివర్ ఇండీ స్కూటర్‌లో ప్రధాన ఫీచర్లు చూస్తే.. దీనిలో 14-అంగుళాల వెడల్పలుతో చక్రాలు ఉంటాయి. సౌకర్యవంతమైన సీట్లు, క్లాస్ స్టోరేజ్ స్పేస్‌లో ఉత్తమమైనవి, డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ తో వస్తుంది. ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఇచ్చారు. రివర్ ఇండీని టాప్ బాక్స్‌లు, ప్యానియర్‌లు, ప్రొటెక్టివ్ విండ్‌షీల్డ్, మొబైల్ హోల్డర్‌తో సహా అనేక ఉపకరణాలతో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450ఎస్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్, బజాజ్ చేతక్ ప్రీమియం వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..