Fact Check: మీ IRCTC ఐడీతో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే జైలు.? ఈ వార్తలో నిజమెంత

|

Jun 26, 2024 | 2:05 PM

రైల్వేశాఖ.. ప్రతీ రోజూ లక్షల్లో జనాలను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. ఈ రైలు ప్రయాణానికి ఐఆర్‌టీసీ యాప్, వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటారు. ఇక చాలామంది తమ IRCTC ఖాతా ద్వారా తమ ఫ్రెండ్స్, బంధువులకు టికెట్ బుక్ చేస్తుంటారు.

Fact Check: మీ IRCTC ఐడీతో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే జైలు.? ఈ వార్తలో నిజమెంత
Railways
Follow us on

రైల్వేశాఖ.. ప్రతీ రోజూ లక్షల్లో జనాలను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. ఈ రైలు ప్రయాణానికి ఐఆర్‌టీసీ యాప్, వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటారు. ఇక చాలామంది తమ IRCTC ఖాతా ద్వారా తమ ఫ్రెండ్స్, బంధువులకు టికెట్ బుక్ చేస్తుంటారు. అయితే అలాంటివారికే ఈ ముఖ్య అలెర్ట్.  ఇక నుంచి మీ పర్సనల్ IRCTC ఐడీ ద్వారా ఇతరులకు రైలు టికెట్లు బుక్ చేస్తే.. జైలు శిక్ష లేదా భారీ జరిమానా పడే అవకాశం ఉందంటూ ఓ వార్త సోషల్ మీడియా వేదికగా గత కొద్దిరోజులుగా వైరల్ అవుతోంది. దీనిపై తాజాగా రైల్వే శాఖ, IRCTC క్లారిటీ ఇచ్చింది.

ఈ ప్రచారం అంతా కూడా అవాస్తవం అని.. ఎలాంటి ఆధారాలు లేవని క్లారిటీ ఇచ్చింది. IRCTC తన రూల్స్ ఏవి కూడా మార్చలేదని.. ఎప్పటిలానే యూజర్లు తమ ఐడీ ద్వారా ఎవరికైనా అనగా ఫ్రెండ్స్, బంధువులు, రక్త సంబంధీకులు ఇలా ఎవరికైనా టికెట్లు బుక్ చేసుకోవచ్చునని తెలిపింది. అలాగే ఆధార్ కార్డు అనుసంధానం చేసుకున్న యూజర్లు నెలకు 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చునని క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో జరిగే ఇలాంటి తప్పుడు ప్రచారాలను నెటిజన్లు నమ్మొద్దు అని తెలిపింది.

ఇది చదవండి: ఎవర్‌ గ్రీన్‌ బిజినెస్ ఇది.. రూ. 10 వేల పెట్టుబడితో ప్రతీ నెలా రూ. లక్షల్లో సంపాదన..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..