Aadhaar Card: ఈ ఆధార్‌ కార్డు వ్యాలిడిటీ ఐదు సంవత్సరాలే.. ఎందుకని అలా..!

Aadhaar Card: ఈ ఆధార్‌ కార్డును మీ సమీప మీ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలు, సేవలను పొందడానికి పిల్లలకు నీలి ఆధార్ కార్డు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానికి 5 సంవత్సరాలు నిండినప్పుడు, భవిష్యత్తులో ఎటువంటి..

Aadhaar Card: ఈ ఆధార్‌ కార్డు వ్యాలిడిటీ ఐదు సంవత్సరాలే.. ఎందుకని అలా..!
Aadhaar Update: ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ సంస్థ గుడ్‌ న్యూస్ చెప్పింది. ఉచితంగా ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు గడువు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఆధార్‌ కార్డు జారీ చేసి పదేళ్లు పూర్తయినట్లయితే వివరాలను అప్‌డేట్‌ చేసుకోవడం చాలా ముఖ్యమని యూఐడీఏఐ చెబుతోంది.

Updated on: Oct 02, 2025 | 8:50 AM

Aadhaar Card: ప్రస్తుతం ఆధార్‌ కార్డు ప్రతి ఒక్కరికి తప్పనిసరి అయిపోయింది. ఇది లేనిది ఏ పని జరగదు. సిమ్‌ కార్డు తీసుకున్నదగ్గర నుంచి బ్యాంకు అకౌంట్‌, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్‌ పథకాలు.. ఇలా ప్రతి దానికి ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. అయితే ఆధార్‌లో బ్లూ ఆధార్ కార్డు గురించి మీకు తెలుసా? ఇది పిల్లల కోసం మాత్రమే అందిస్తారు. కానీ దీని చెల్లుబాటలో కొంత తేడా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Viral Video: దొంగల ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌.. షాపులోకి రాగానే కనిపించకుండా పోయారు.. ఫాగింగ్ యంత్రంతో బెడిసికొట్టింది!

బ్లూ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి?

నీలిరంగు ఆధార్ కార్డు ప్రత్యేకంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం అందిస్తారు. ఇది సాధారణ ఆధార్ కార్డు కంటే భిన్నంగా ఉంటుంది. నీలం రంగు థీమ్‌ను కలిగి ఉంటుంది. ఇది సులభంగా గుర్తించదగినదిగా చేస్తుంది. చిన్న పిల్లల వేలిముద్రలు, ఐరిస్ వంటివి ఉండవు. ఈ కార్డును తయారు చేయడానికి బయోమెట్రిక్ డేటా అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

ఈ బ్లూ ఆధార్‌ను ఎలా ధృవీకరిస్తారు?

బ్లూ ఆధార్ ధృవీకరణ కోసం పిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులలో ఎవరికైనా ఆధార్ కార్డు అవసరం. పిల్లల సమాచారం తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానించబడి ఉంటుంది.

ఈ కార్డు ఎన్ని సంవత్సరాలకు అప్‌డేట్‌ చేయాలి?

బిడ్డకు 5 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు అతని/ఆమె ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాలను (వేలిముద్ర, ఐరిస్ స్కాన్) జోడించడం అవసరం. దీని కోసం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి ప్రక్రియను పూర్తి చేయాలి. మంచి విషయం ఏమిటంటే ఈ అప్‌డేట్ పూర్తిగా ఉచితం. అలాగే దానిలో ఆధార్ నంబర్ మారదు. బయోమెట్రిక్ సమాచారం మాత్రమే జోడిస్తారు.

బాల్ ఆధార్ ఎలా పొందాలి?

ఈ ఆధార్‌ కార్డును మీ సమీప మీ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలు, సేవలను పొందడానికి పిల్లలకు నీలి ఆధార్ కార్డు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానికి 5 సంవత్సరాలు నిండినప్పుడు, భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకుండా ఉండేందుకు దానిని సకాలంలో అప్‌డేట్‌ చేయడం ముఖ్యమని గుర్తించుకోండి.

ఇది కూడా చదవండి: Gold Price Today: పండగ పూట షాకిచ్చిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి