PM Kisan: రైతులకు బిగ్‌ అలర్ట్‌.. వీరికి పీఎం కిసాన్‌ నిలిపివేత.. కారణం ఏంటంటే..!

PM Kisan Scheme: రైతులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ రైతులకు పీఎం కిసాన్‌ నిధులను నిలిపివేయనుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో 22వ విడత డబ్బులు జమ చేసింది. అయితే తదుపరి విడత 23వ విడత కోసం ఎదరు చూస్తున్నారు. చాలా మందికి గత విడత డబ్బులు జమ చేలేదు ప్రభుత్వం. కొన్ని కారణాలతో వాయిదాను నిలిపివేసిన కేంద్రం..

PM Kisan: రైతులకు బిగ్‌ అలర్ట్‌.. వీరికి పీఎం కిసాన్‌ నిలిపివేత.. కారణం ఏంటంటే..!
Pm Kisan Scheme

Updated on: Apr 26, 2026 | 7:52 AM

PM Kisan: కేంద్ర ప్రభుత్వ రైతుల కోసం అమలు చేస్తు్న్న పథకాల్లో పీఎం కిసాన్‌ స్కీమ్‌ ఒకటి. ప్రతి సంవత్సరం రైతులకు ఆర్థిక సాయం అందిస్తోంది కేంద్రం. అది కూడా మూడు విడతల్లో 2 వేల రూపాయల చోప్పున మొత్తం ఏడాదికి రూ.6000 అందిస్తోంది కేంద్రం. ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత అందుకున్న రైతులు ఇప్పుడు 23వ విడత కోసం వేచి ఉన్నారు.

ఈ తప్పు చేస్తే 23వ విడత రాదు:

ఇప్పటి వరకు 22వ విడత డబ్బులు అందుకున్న రైతులు.. ఇప్పుడు 23వ విడత రావాలంటే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చిన్నపాటి పొరపాట్లతో రైతులకు డబ్బులను నిలిచివేసింది. అదే కేవైసీ. ఈ కేవైసీ పూర్తి చేయని రైతులకు గత విడత డబ్బులను నిలిపివేసింది. దీంతో వారి బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ లింకు చేయడం, ఫోన్‌ నంబర్‌ అప్‌డేట్‌ చేయడం తప్పనిసరి. ఈ కేవైసీ వివరాలు చేయని రైతులు తప్పనిసరి కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవడం మంచిది. అయితే గత విడత అందుకోలేని రైతులు అప్‌డేట్‌ చేసుకున్న తర్వాత కేంద్రం పరిశీలించి తర్వాత వారి అకౌంట్‌లో డబ్బులు జమ చేయనుంది. అయితే గత విడతకంటే ముందు నుంచి కేవైసీ చేసిన రైతులకు పీఎం కిసాన్‌ డబ్బులు అందవని గుర్తించుకోండి. వచ్చే 23వ విడత కూడా అందదు. కేవైసీ పూర్తి చేయని రైతులకు పీఎం కిసాన్‌ డబ్బులను నిలిపివేస్తోంది కేంద్రం.

ఈ పథకం నుండి ప్రయోజనం పొందాలంటే, మీరు మీ ఆధార్ కార్డును మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి. అదనంగా, పాన్ కార్డ్ వెరిఫికేషన్, మీ బ్యాంక్ ఖాతాతో ఏవైనా సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అలా చేయడంలో విఫలమైతే నిధులను స్వీకరించడంలో గణనీయమైన ఇబ్బందులు తలెత్తవచ్చు.

ఇంట్లో కూర్చొని మీ స్థితిని ఇలా తనిఖీ చేయండి:

మీరు మీ ఇంటి నుండే కిసాన్ యోజన కింద మీ స్థితిని తనిఖీ చేయవచ్చు. దీని కోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ని ఓపెన్‌ చేయండి. హోమ్ పేజీలో “Know Your Status”ను ఎంపికపై క్లిక్‌ చేయండి. ఇక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయాలి. మీకు మీ రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తులేకపోతే, “మీ రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోండి” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను ఉపయోగించి మీరు దానిని కనుగొనవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us