
Multibagger: స్టాక్ మార్కెట్‌లో ప్రతిఒక్కరూ ఇలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్‌పై కన్నేసి ఉంచుతారు. భారత మార్కెట్‌లో అలాంటి ఒక మల్టీబ్యాగర్ స్టాక్ కూడా ఉంది. ఇది 5 సంవత్సరాలలో పెట్టుబడిదారుల డబ్బును అనేక రెట్లు పెంచింది. 71 రూపాయల స్టాక్ 820 రూపాయలకు పెరిగింది.
స్టాక్ మార్కెట్‌లోని అత్యంత అస్థిర పరిస్థితులలో కూడా ఈ స్టాక్ గొప్ప పనితీరును కనబరిచింది. ఈ కంపెనీ ఏటా మంచి పనితీరును కనబరుస్తోంది. ఫలితంగా పెట్టుబడిదారులు మల్టీ-బిలియన్ డాలర్ల రాబడిని పొందారు. భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఈ స్టాక్ పేరు ICE Make Refrigeration. మీరు ఐదు సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు ఈ స్టాక్‌లో పెట్టుబడి పెట్టి ఉంటే ఈ రోజు మీకు 11.5 లక్షల రూపాయల రాబడి లభించి ఉండేది.
స్టాక్ మార్కెట్ చరిత్రను పరిశీలిస్తే, ఏటా స్థిరంగా మంచి రాబడులు ఇస్తున్న ఈ స్టాక్ ఇటీవల కొద్దిగా వెనక్కి తగ్గింది. ఫలితంగా ఇప్పుడు చాలామంది ఈ స్టాక్‌ను కొనడానికి వెనుకాడుతున్నారు. అయితే, ఈ మల్టీబ్యాగర్ స్టాక్ పెట్టుబడిదారులకు గొప్ప సంపదను సృష్టించిందని చరిత్ర చెబుతోంది.
ఈ స్టాక్ ఫిబ్రవరి 2022 నుండి భారత స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్‌ను చూసింది. ఇది ఏప్రిల్ 2025 వరకు నిరంతర సానుకూల రాబడులను ఇచ్చింది. ఈ కాలంలో ఈ స్టాక్ పెట్టుబడిదారులకు 1240 శాతం రాబడిని ఇచ్చింది. ఇటీవల స్టాక్ ధర రూ. 1088 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. గతంలో రెండంకెల స్టాక్‌గా ఉంది. ఇప్పుడు మూడెంకెల స్థాయికి చేరుకుంది. ఈ స్టాక్ మార్చి 2020లో రూ. 25.65 కనిష్ట స్థాయికి పడిపోయింది. అప్పటి నుండి ఈ స్టాక్ 3096 శాతం పెరుగుదలను చూసింది. ఇప్పుడు, ఒక షేరు ధర రూ. 820గా ఉంది.
ఇది కూడా చదవండి: House Construction: 100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..? పూర్తి లెక్కలు ఇవే..!
ఇది కూడా చదవండి: House Construction: ఇల్లు బలంగా ఉండాలంటే వాటర్ క్యూరింగ్ ఎన్ని రోజులు చేయాలి? స్లాబ్, పిల్లర్స్, గోడలకు నీళ్లు ఎంతసేపు పట్టాలి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి