ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య ప్లాస్టిక్. రోజురోజుకీ పెరుగుతోన్న ప్లాస్టిక్ వినియోగం కారణంగా కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఎన్నో అనర్థాలకు దారి తీస్తోంది. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికే ప్రభుత్వాలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ప్లాస్టిక్ వాడే వారిపై చట్టపరంగా జరిమానాలు విధిస్తున్నాయి. దీంతో అనివార్యంగా ప్రజలు ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. పేపర్‌తో తయారు చేసిన వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది.
దీనిని అవకాశంగా అందిపుచ్చుకుంటే మంచి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మార్కెట్లో లభించే స్ట్రాలు దాదాపు ప్లాస్టిక్‌తో తయారు చేసినవే ఉంటాయి. అయితే ప్లాస్టిక్‌పై నిషేధం విదించిన తర్వాత పేపర్ స్ట్రాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో పేపర్ స్ట్రా వ్యాపారం మంచి అవకాశంగా మారింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలనుకునే వారికి పేపర్ స్ట్రాలను తయారు చేయడం మంచి ఆప్షన్‌గా మారింది. చాలా హోటల్స్, జ్యూస్ సెంటర్స్ పేపపర్ స్ట్రాలను వినియోగిస్తున్నాయి. మరి పేపర్ స్ట్రాల తయారీని ప్రారంభించి ఎలాంటి ఆదాయం పొందొచ్చు.? ఈ వ్యాపారం ప్రారంభించడానికి ఎంత పెట్టుబడి పెట్టాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
పేపర్ స్ట్రాలను తయారీ చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో బ్యాంకు నుంచి రుణం కూడా పొందొచ్చు. పేపర్ స్ట్రాల తయారీకి వ్యాపారాన్ని ప్రారంభించాలంటే సుమారు రూ. 20 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రభుత్వం నుంచి జీఎస్‌టీ రిజిస్ట్రేషన్, బ్రాండ్ పేరు పేటెంట్ వంటి సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి నాన్ ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.
ఇక పేపర్ స్ట్రా తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం అందించే ముద్ర లోన్ కూడా పొందొచ్చు. దీంతో తక్కువ వడ్డీతోనే రుణం పొందొచ్చు. పేపర్ స్ట్రా తయారీకి ఫుడ్ గ్రేడ్ పేపర్, ఫుడ్ గ్రేడ్ గమ్ పౌడర్, ప్యాకేజీంగ్ మెటీరియల్ అవసరం ఉంటుంది. ఇక పేపర్ స్ట్రా మేకింగ్ మిషన్ కూడా కావాల్సి ఉంటుంది. దీని ధర సుమారు రూ. 9 లక్షల వరకు ఉంటుంది. పేపర్ స్ట్రాల తయారీతో ద్వారా నెలకు కనీసం రూ. 50 నుంచి 60 వేల వరకు సంపాదించొచ్చు. మంచి మార్కెటింగ్ టెక్నిక్ వాడుతూ, ప్రచారం చేసుకుంటే ఈ లాభం మరింత పెరుగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..