Andhra News: విజయవాడ నుంచి 6 గంటల్లోనే బెంగళూరుకు.. కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేపై అప్డేట్ వచ్చేసింది..

బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా కొడికొండ సమీపంలోని NH-44 ఇంటర్‌ఛేంజ్‌ ఈ ప్రాజెక్టులో కీలకంగా మారనుంది. 2027 నాటికి ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఇది పూర్తయితే ఏపీకి ఆర్దికంగా ఉపయోగపడనుంది.

Andhra News: విజయవాడ నుంచి 6 గంటల్లోనే బెంగళూరుకు.. కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేపై అప్డేట్ వచ్చేసింది..
Viajyawada

Updated on: Oct 21, 2026 | 9:28 PM

ఇకపై కేవలం 6 గంటల్లోనే బెంగళూరు-విజయవాడ మధ్య ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి 11 నుంచి 12 గంటల సమయం పడుతుంది. అయితే విజయవాడ-బెంగళూరు మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. ఆరు లైన్లుగా ఈ హైవే ఉండనుండగా.. భారత్ మాల పరియోజనా ఫేజ్-2 కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్నారు. దీని నిర్మాణానికి దాదాపు రూ.19,200 కోట్లు ఖర్చు పెడుతుండగా.. నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏపీలో కోడికొండ వద్ద ప్రారంభం కానున్న ఈ ఎక్స్‌ప్రెస్ వే.. ప్రకాశం జిల్లాలోని అద్దంకి వద్ద ముగుస్తుంది. 2027 నాటికి పూర్తి చేసి దీనిని అందుబాటులోకి తీసుకురావాలని నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా భావిస్తోంది. మొత్తం 14 ప్యాకేజీలుగా ఈ పనులు చేపడుతున్నారు. బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా దీని నిర్మాణం చేపడుతున్నారు. ఈ కొత్త హైవే పూర్తయితే కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ మధ్య అనుసంధానాన్ని మెరుగుపడనుంది.

ఈ ప్రాజెక్ట్‌లో కొడికొండ సమీపంలోని NH-44 ఇంటర్‌ఛేంజ్ ఒక ముఖ్యమైన ప్రాంతంగా చెప్పవచ్చు. ఇక్కడి సింగిల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్ బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్ వేను జాతీయ రహదారి 44 (NH-44)తో కనెక్ట్ చేస్తుంది. కోడూరు పట్టణం దాటిన వెంటనే ఈ ఇంటర్‌ఛేంజ్ ఉంటుంది. బెంగళూరు నుండి కొడికొండ వరకు ఇప్పటికే హైవే ఉండగా.. కొడికొండ నుండి అద్దంకి వరకు కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తున్నారు. అక్కడి నుండి విజయవాడ వరకు ఇప్పటికే ఉన్న ఆరు లేన్ల ద్వారా చేరుకోవచ్చు. దీని వల్ల బెంగళూరు- విజయవాడ మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. ప్రస్తుతం 643 కిలోమీటర్ల దూరం ఉంటుండగా.. ఈ కొత్త ప్రాజెక్టు పూర్తయితే కేవలం 518 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. దీని వల్ల ప్రయాణ సమయం కూడా బాగా ఆదా అవుతుంది.

ఇక ఎక్స్‌ప్రెస్ వే పక్కన సర్వీస్ రోడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నారు. ఆ ప్రాజెక్ట్ పనులపై 2026 జవవరిలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కర్ణాటకలోని దేవనహళ్లి నుంచి ఏపీలోని కోడికొండ వరకు 90 కిలోమీటర్ల మేర ఉన్న నేషనల్ హైవే (NH-44)ను NHAI డీపీఆర్ సిద్ధం చేస్తోంది. త్వరలో దీనిపై కూడా ఒక స్పష్టత రానుంది. ఏపీ నుంచి బెంగళూరుకు ఉద్యోగాలు, వ్యాపారాల కోసం చాలామంది ప్రయాణిస్తుంటారు. ఈ హైవే పూర్తయితే వారందరికీ ఉపయోగం కలగనుంది. అలాగే పారిశ్రామిక అభవృద్దికి కూడా ఉతం ఇవ్వనుంది. దీని వల్ల ఏపీకి ఆర్ధికంగా ప్రయోజనం చేకూర్చనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us