Banks Holidays: బిగ్ అలర్ట్.. ఈ నెలలో మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..?

Updated on: Dec 26, 2025 | 9:38 AM

డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగ రావడంతో 25వ తేదీన బ్యాంకులు మూతపడిన విషయం తెలిసిందే. అయితే పలు రాష్ట్రాల్లో 26,27 తేదీల్లో కూడా బ్యాంకులు బంద్ కానున్నాయి. స్థానిక పండుగలే దీనికి కారణంగా తెలుస్తోంది. ఆర్బీఐ సెలవుల లిస్ట్ ఇలా ఉంది. ఆ వివరాలు చూద్దాం.

1 / 5
బ్యాంక్ సేవలు అనేవి ప్రతీఒక్కరికీ అవసరమే. ఆర్ధిక కార్యకలాపాలు సజావుగా నిర్వహించుకోవడానికి బ్యాంకులు సహయపడతాయి.   క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 25వ తేదీన దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ మూతపడ్డాయి. కానీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కొనసాగుతున్నందున పలు రాష్ట్రాల్లో 26,27వ తేదీల్లో కూడా బ్యాంకులు మూసివేయనున్నారు.

2 / 5
ఇక ఆదివారం కూడా సెలవు దినం కావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. 2025-26 ఆర్ధిక సంవత్సంలో ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల లిస్ట్ ప్రకారం బ్యాంకు సెలవులు ఉంటాయి. అందులో భాగంగా డిసెంబర్‌లో మరో నాలుగు అధికారిక సెలవులు షెడ్యూల్ చేయబడ్డాయి.

3 / 5
డిసెంబర్ 26,27వ తేదీల్లో పలు ఈశాన్య రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ కానున్నాయి. ఐజ్వాల్, కోహిమా, షిల్లాండ్ ప్రాంతాల్లో 26వ తేదీన మూతపడనుండగా.. కోహిమాలో 27న బంద్ కానన్నాయి. ఇక మిగిలిన అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. స్థానిక పండుగలు, పరిస్థితుల ఆధారంగా బ్యాంకులకు ఆర్బీఐ సెలవులు ప్రకటిస్తూ ఉంటుంది. అందులో భాగంగా మూతపడనున్నాయని తెలుస్తోంది.

4 / 5
బ్యాంకులు మూతపడినా ఆన్‌లైన్ సేవలు ఎప్పటిలాగే కొనసాగుతాయి. నెఫ్ట్, ఆర్టీజీఎస్ కార్యకలాపాలు కొనసాగుతాయి. బిల్లు చెల్లింపులు, నిధుల బదిలీ, బ్యాలెన్స్ చెకింగ్ లాంటివి నిర్వహించుకోవచ్చు. ఇక చెక్‌బుక్‌లు, డిమాండ్ డ్రాఫ్ట్, అకౌంట్ సంబంధిత సేవలకు ఆన్‌లైన్‌లో అభ్యర్థనలు పెట్టుకోవచ్చు.

5 / 5
ఇక నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు యధావిధిగా ట్రాన్సక్షన్లు చేసుకోవచ్చు. బ్యాంకులు మూతపడటం వల్ల చెక్కుల క్లియరింగ్ వంటి సేవలు ఆగిపోనున్నాయి.