Credit Card: సిబిల్ స్కోర్ లేకపోయినా క్రెడిట్ కార్డు పొందొచ్చు.. ఈ 3 విషయాలు పాటిస్తే సరిపోతుంది..

మీకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. క్రెడిట్ కార్డు రావడం లేదని బాధపడుతున్నారా.. అయితే నో టెన్షన్. క్రెడిట్ స్కోర్ లేకపోయినా క్రెడిట్ కార్డు పొందవచ్చు. ఇందుకోసం అనేక మార్గాలు అందుబాటులో ప్రస్తుతం ఉన్నాయి. ఎలా పొందాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Credit Card: సిబిల్ స్కోర్ లేకపోయినా క్రెడిట్ కార్డు పొందొచ్చు.. ఈ 3 విషయాలు పాటిస్తే సరిపోతుంది..
Credit Card

Updated on: Jun 19, 2026 | 12:03 PM

క్రెడిట్ కార్డు.. ఇప్పటి రోజుల్లో్ ఎక్కుమంది దీనిని వాడుతున్నారు. వ్యాపారులు, ఉద్యోగులు మాత్రమే కాకుండా ఇటీవల సామాన్యుల దగ్గర కూడా ఇది కనిపిస్తోంది. అయితే క్రెడిట్ కార్డు పొందాలంటే సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండాలని చాలామంది భావిస్తుంటారు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటం వల్ల తమకు క్రెడిట్ కార్డు రాదనుకుని బాధపడతుంటారు. అయితే అది నిజం కాదు. సిబిల్ స్కోర్ లేకపోయినా మీరు క్రెడిట్ కార్డు పొందవచ్చు. ఇందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఈ పద్దతుల ద్వారా మీకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా క్రెడిట్ కార్డును పొందవచ్చు. ఈ ప్రాసెస్ ఏంటి..? ఎలా పొందాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా..

ఫిక్స్‌డ్ డిపాజిట్‌ లింక్డ్ క్రెడిట్ కార్డులను అన్ని బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. అంటే ముందుగా మీరు కొంతమొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. అనంతరం దానికి అనుసంధానంగా క్రెడిట్ కార్డును మీకు అందిస్తారు. మీరు జమ చేసిన అమౌంట్‌ ఆధారంగా 90 శాతం వరకు క్రెడిట్ కార్డు లిమిట్ అందిస్తారు. ఈ విధానంలో మీ సిబిల్ స్కోర్‌తో సంబంధం ఉండదు. మీ క్రెడిట్ స్కో్ పరిగణలోకి తీసుకోకుండానే క్రెడిట్ కార్డును జారీ చేస్తారు. మీరు జమ చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను మీరు ఎప్పుడైనా తీసుకొవచ్చు. ఒకవేళ అలాగే ఉంచుకుంటే ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై మీకు వడ్డీ కూడా అందిస్తారు.

క్రెడిట్ హిస్టరీ ఆధారంగా..

మీ అకౌంట్లలోని క్రెడిట్ హిస్టరీ ఆధారంగా కూడా క్రెడిట్ కార్డును జారీ చేస్తారు. ప్రతీ నెలా మీ అకౌంట్లో ఒక నిర్దిష్టమైన సొమ్ము పడుతుందనుకుందాం. ఉదాహరణకు ఉద్యోగాలు చేసేవారికి ప్రతీ నెలా శాలరీ అకౌంట్‌లో పడుతుంది. అలాగే వ్యాపారులు చేసేవారి అకౌంట్లలో కూడా కస్టమర్ల నుంచి డబ్బులు జమ అవుతూ ఉంటాయి. ఇలా ప్రతీ నెలలో మీ అకౌంట్లలో నిర్టిష్టమైన సొమ్ము జమ అవుతుంటే బ్యాంకులు క్రెడిట్ కార్డు ఇచ్చేందుకు ముందుకొస్తాయి.

యాడ్- ఆన్ క్రెడిట్ కార్డ్

ఇక మీ కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల్లో ఎవరికైనా క్రెడిట్ కార్డు ఉందనుకుందాం. వారి కార్డుకు అనుసంధానంగా యాడ్-ఆన్ క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. దీనికి సిబిల్ అవసరం ఉండదు.

సిబిల్ స్కోర్ ఎందుకు ముఖ్యం..?

సిబిల్ స్కోర్ 300 నుండి 900 మధ్య ఉండే ఒక సంఖ్య. మీ ఆదాయం, అప్పులు, లోన్లు, బకాయిలు వంటి ఆధారంగా దీనిని నిర్ణయిస్తారు. 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీ క్రెడిట్ స్కోర్ ఎక్సలెంట్‌గా ఉందని అర్థం. వీరికి రుణాలు, క్రెడిట్ కార్డులు అత్యంత వేగంగా మంజూరవుతాయి. మీ స్కోర్ 900కి దగ్గరగా ఉంటే.. మంచి నిబంధనలతో రుణం పొందే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. రుణం ఆమోదించేటప్పుడు బ్యాంకులు మీ ఆదాయం, ఉద్యోగం. ఇతర ఆర్థిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాయి.

Follow Us