ఇకపై డబ్బు జమ చేయాలంటే.. వారి అనుమతి తప్పనిసరి!

|

Aug 21, 2019 | 3:45 PM

మున్ముందు బ్యాంక్ నుంచి ఎవరి ఖాతాలోనైనా డబ్బు జమ చేయాలంటే.. ఆ ఖాతాదారుడి అనుమతిని తీసుకునే విధానాన్ని త్వరలోనే ప్రవేశపెట్టాలని బ్యాంకులు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రసంగించగా.. తాజాగా దీనిపై విధివిధానాలను వివరిస్తూ ఆర్బీఐకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక ముందు ఎవరైనా ఏదైనా ఖాతాలో డబ్బును జమ చేయాలని అనుకుంటే.. ముందుగానే సదరు ఖాతాదారుడికి నోటిఫికేషన్ వెళ్తుందని.. వారు అనుమతిస్తేనే డబ్బు ఖాతాలో […]

ఇకపై డబ్బు జమ చేయాలంటే.. వారి అనుమతి తప్పనిసరి!
Follow us on

మున్ముందు బ్యాంక్ నుంచి ఎవరి ఖాతాలోనైనా డబ్బు జమ చేయాలంటే.. ఆ ఖాతాదారుడి అనుమతిని తీసుకునే విధానాన్ని త్వరలోనే ప్రవేశపెట్టాలని బ్యాంకులు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రసంగించగా.. తాజాగా దీనిపై విధివిధానాలను వివరిస్తూ ఆర్బీఐకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక ముందు ఎవరైనా ఏదైనా ఖాతాలో డబ్బును జమ చేయాలని అనుకుంటే.. ముందుగానే సదరు ఖాతాదారుడికి నోటిఫికేషన్ వెళ్తుందని.. వారు అనుమతిస్తేనే డబ్బు ఖాతాలో డిపాజిట్ అవుతుందని ఈ ప్రక్రియకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

‘నోట్ల రద్దు సమయంలో అనేక మోసాలు జరగడం వల్లే.. కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నాం. అటు జన్ ధన్ ఖాతాలను కూడా నల్లధనాన్ని చట్టబద్ధంగా చేయడంలో వాడుకున్నట్లు కూడా ఫిర్యాదులు వచ్చాయని కాబట్టే వాటిని అరికట్టడానికి సరికొత్త విధానం అమలలోకి రానుంది’. ఈ దిశగా చర్యలు ప్రారంభించాం అని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే ఈ సేవలు అందరికి ఉచితం కాదు. వీటిని పొందడానికి బ్యాంకులకు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.