మేలో నాలుగు దశల ఎన్నికలతో సహా మొత్తం 14 రోజుల బ్యాంకు సెలవులు ఉంటాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం 11 సెలవులు ఉన్నాయి. కర్ణాటకలో మే 7న 3వ దశ ఎన్నికల నేపథ్యంలో కొన్ని చోట్ల సెలవులు ఉండనున్నాయి. బసవ జయంతి, బుద్ధ పూర్ణి, కార్మిక దినోత్సవం సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో కూడా బ్యాంకులు మూసి ఉంటాయి. ఇందులో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలలో సెలవులు ఉన్నాయి. క్యాలెండర్ ప్రకారం.. మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాలు సహా 11 రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. మే 7, 13, 20, 25 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ జరగనుంది. అయితే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. వివిధ రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గుర్తించుకోండి.
మే 2024లో బ్యాంక్ సెలవుల జాబితా