FD Rates: కస్టమర్లకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గుడ్ న్యూస్‌.. ఎఫ్‌డీ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం..

|

Dec 01, 2023 | 7:33 PM

ఈ వడ్డీ రేట్లు హెచ్‌ఎన్‌ఐలు.. చిన్న, మధ్యతరహా కార్పొరేట్‌లు, NRIలు & వృత్తిపరంగా స్వయం ఉపాధి పొందినవారు మొదలైన వారికి అందుబాటులో ఉంటాయని బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే.. నవంబర్ 1, 2023 నుంచి అమల్లోకి వచ్చేలా రెండేళ్ల కాలవ్యవధి కోసం "రూ. 2 కోట్ల కంటే తక్కువ" మొత్తానికి అన్ని డిపాజిట్ల రేటును పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే...

FD Rates: కస్టమర్లకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గుడ్ న్యూస్‌.. ఎఫ్‌డీ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం..
Bank Of India Fd Rates
Follow us on

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌డీలకు సంబంధించి తమ కస్టమర్లకు గుడ్ న్యూస్‌ చెప్పింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు సంబంధించి వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇంతకీ ఏయే కాల వ్యవధిలకు సంబంధించి ఎఫ్‌డీ రేట్లపై వడ్డీ రేట్లను పెంచారో ఇప్పుడు తెలుసుకుందాం.

రూ. 2 కోట్ల కంటే ఎక్కువ రూ. 10 కోట్ల కంటే తక్కువ డిపాజిట్స్‌పై 46 రోజుల నుంచి ఏడాది వరకు మెచ్యూరిటీ కలిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచింది. ఈ రేట్లు డిసెంబర్‌ 1వ తేదీ అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను “46 రోజుల నుంచి 90 రోజుల” కాలవ్యవధికి 5.25%కి, “91 రోజుల నుంచి 179 రోజుల” కాలవ్యవధికి 6.00%కి, “180 రోజుల నుంచి 210 రోజుల” కాలవ్యవధికి 6.25%కి, “211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ” కాల వ్యవధికి 6.50%, “1 సంవత్సరం” కాలవ్యవధికి 7.25% కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఈ వడ్డీ రేట్లు హెచ్‌ఎన్‌ఐలు.. చిన్న, మధ్యతరహా కార్పొరేట్‌లు, NRIలు & వృత్తిపరంగా స్వయం ఉపాధి పొందినవారు మొదలైన వారికి అందుబాటులో ఉంటాయని బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే.. నవంబర్ 1, 2023 నుంచి అమల్లోకి వచ్చేలా రెండేళ్ల కాలవ్యవధి కోసం “రూ. 2 కోట్ల కంటే తక్కువ” మొత్తానికి అన్ని డిపాజిట్ల రేటును పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే బ్యాంక్‌ ఆఫ్ ఇండియా సీనియర్‌ సీటీజన్లకు అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ బ్యాంక్ తన అత్యధిక వడ్డీ రేటును సూపర్ సీనియర్ సిటిజన్‌కు 7.90%, సీనియర్ సిటిజన్‌లకు 7.75%, ఇతరులకు 7.25% వరకు 2 సంవత్సరాల కాలవ్యవధికి అందిస్తోంది. సవరించిన వడ్డీ రేట్లు దేశీయ, NRO, NRE రూపాయి టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..