Bank of baroda: గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించిన ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎంతంటే..

|

Apr 23, 2022 | 6:54 PM

పరిమిత కాలానికి గృహ రుణాలపై వడ్డీ రేట్లను సంవత్సరానికి 6.75 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గించినట్లు ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా శుక్రవారం తెలిపింది...

Bank of baroda: గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించిన ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎంతంటే..
Bank Of Baroda
Follow us on

పరిమిత కాలానికి గృహ రుణాలపై వడ్డీ రేట్లను సంవత్సరానికి 6.75 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గించినట్లు ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా శుక్రవారం తెలిపింది. రుణగ్రహీత క్రెడిట్ ప్రొఫైల్‌తో అనుసంధానించిన కొత్త రేట్లు జూన్ 30, 2022 వరకు వర్తిస్తాయని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. గత కొన్ని నెలల్లో గృహ విక్రయాలలో గణనీయమైన పెరుగుదల కనిపించిందని బ్యాంకు జనరల్ మేనేజర్ హెచ్‌టి సోలంకి తెలిపారు. నిర్దిష్ట, పరిమిత కాలానికి సున్నా ప్రాసెసింగ్ ఛార్జీల ప్రత్యేక, పరిమిత కాల వడ్డీ రేటు ఆఫర్‌ను ప్రవేశపెట్టినట్లు సోలంకి చెప్పారు. కొత్త హోమ్ లోన్, బ్యాలెన్స్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు కొత్త రేటు అందుబాటులో ఉండనుంది. 771 అంతకంటే ఎక్కువ CIBIL స్కోర్‌ ఉన్న రుణగ్రహీతలకు ఇది అందుబాటులో ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా కొన్ని రోజుల క్రితం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బెస్ట్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచింది. 12 ఏప్రిల్ 2022 నుంచి బ్యాంక్ MCLRని 0.05 శాతం పెంచింది. దీని కింద, MLCR ఒక సంవత్సర కాలానికి 7.35 శాతానికి పెరిగింది. గృహ రుణం, వాహన రుణం, వ్యక్తిగత రుణం వంటి వినియోగదారుల రుణాలు చాలా వరకు ఒక సంవత్సరం MCLRపై ఆధారపడి ఉన్నాయి. 12 ఏప్రిల్ 2022 నుంచి అమలులోకి వచ్చే MCLR సమీక్షను ఆమోదించినట్లు బ్యాంక్ స్టాక్ మార్కెట్‌కు తెలిపింది. ఏప్రిల్ 2016 తర్వాత బ్యాంకులు MCLR అమలు చేస్తున్నారు.

Read Also.. Gautam Adani: మరో రెండు కీలక రంగాల్లో అదానీ ఎంట్రీ.. ఇతర పారిశ్రామిక దిగ్గజాలతో ఢీ అంటే ఢీ..