September Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..!

|

Aug 25, 2022 | 6:35 AM

Bank Holidays In September: నెల పొడవునా ఎంతో మందికి బ్యాంకుకు సంబంధించిన ఎన్నో రకాల పనులుంటాయి. కానీ అప్పుడప్పుడు బ్యాంకులకు సెలవులు..

September Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..!
Bank Holidays In September
Follow us on

Bank Holidays In September: నెల పొడవునా ఎంతో మందికి బ్యాంకుకు సంబంధించిన ఎన్నో రకాల పనులుంటాయి. కానీ అప్పుడప్పుడు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ముందస్తుగా బ్యాంకులు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుంటే బ్యాంకు పనులు ప్లాన్‌ చేసుకోవచ్చు. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ప్రతి నెల బ్యాంకులకు సంబంధించిన సెలవులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) విడుదల చేస్తుంటుంది. ఇక ఆగస్టు నెల ముగియబోతోంది. వచ్చే సెప్టెంబర్‌ నెలలో మొత్తం బ్యాంకులు 14 రోజులు ఉండనున్నాయి. మరి ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.

ఆర్బీఐ క్యాలెండర్‌ ప్రకారం.. సెప్టెంబర్‌ నెలలో మొత్తం 8 రోజులు సెలవులు ఉన్నాయి. ఇవి కాకుండా శని, ఆదివారాలు కలిపి 6 రోజులున్నాయి. అంతే మొత్తం 14 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే ఈ సెలవులు కూడా వివిధ రాష్ట్రాలలో వేర్వేరుగా ఉంటాయి. రాష్ట్రాలను బట్టి ఉంటాయి. అయితే వివిధ రాష్ట్రాల్లో ఈ సెలవులు వేర్వేరుగా ఉంటాయి.

సెప్టెంబర్‌ 1వ తేదీన గోవాలో వినాయక చవితి, సెప్టెంబర్‌ 6న జార్ఖండ్‌లో కర్మపూజ పేరుతో బ్యాంకులకు సెలవులు, అలాగే సెప్టెంబర్‌ 7,8 తేదీల్లో కేరళలో ఓనం పండగ, 9వ తేదీ సిక్కిం, గ్యాంగ్‌టక్‌లో ఇంద్రజాత సెలవుంది. 10వ తేదీన శ్రీ నరవణ గురు జయంతి సందర్బంగా కేరళలో బ్యాంకులకు సెలవు. సెప్టెంబర్‌ 21న కేరళలో శ్రీనారాయణ గురు సమాధి దినం, సెప్టెంబర్‌ 26న నవరాత్రి స్థాపన కారణంగా మణిపాల్‌, రాజస్థాన్‌లో బ్యాంకులకు సెలవు. సెప్టెంబర్‌ 24వ తేదీన నాలుగో శనివారం. ఇలా వివిధ రాష్ట్రాల్లో సెప్టెంబర్‌లో సెలవులు ఉండనున్నాయి.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ నెలలో సెలవుల జాబితా

సెప్టెంబర్ 1- వినాయక చవితి రెండవ రోజు
సెప్టెంబర్ 4 – ఆదివారం
సెప్టెంబర్ 6 – కర్మపూజ
సెప్టెంబర్ 7, 8 – ఓనం
సెప్టెంబర్ 9 – ఇంద్రజాత
సెప్టెంబర్ 10 -శ్రీ నరవణ గురు జయంతి, రెండవ శనివారం
సెప్టెంబర్ 11 – ఆదివారం
సెప్టెంబర్ 18 – ఆదివారం
సెప్టెంబర్ 21- శ్రీ నారాయణ గురు సమాధి
సెప్టెంబర్ 24 – నాలుగవ శనివారం
సెప్టెంబర్ 25 – ఆదివారం
సెప్టెంబర్ 26 – ఆదివారం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..