ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తుంటుంది రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకులకు సంబంధించిన వివిధ పనులను చేసుకునేందుకు సెలవులను గమనించి ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో గమనించకుంటే సమయం వృధా కావడమే కాకుండా కొంత డబ్బు కూడా వృధా అవుతుంటుంది. ముందస్తుగానే బ్యాంకులకు సెలవులను గమనించి ప్లాన్ చేసుకోవడం మంచిది.
అయితే దేశవ్యాప్తంగా నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు జాతీయ సెలవు దినాలు. మరో ఆరు రోజులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు పని చేయవు. మొత్తం 12 రోజుల పాటు మార్చిలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.