Bank Holidays: వినియోగదారులకు అలర్ట్.. 13 రోజుల పాటు బ్యాంకులు బంద్‌!

Bank Holidays: ఆదివారం, రెండో, నాలుగో శనివారం కాకుండా, ఇతర ప్రత్యేక కారణాల వల్ల కూడా బ్యాంకులు మూసివేయబడవచ్చు. అయితే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గుర్తించుకోండి. అయితే..

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్.. 13 రోజుల పాటు బ్యాంకులు బంద్‌!

Updated on: Jun 24, 2025 | 11:48 AM

July Bank Holidays: జూన్‌ నెల ముగియబోతోంది. ఇక జూలై నెల వస్తోంది. చాలా మంది ప్రతి రోజు బ్యాంకు పనుల నిమిత్తం వెళ్తుంటారు. అలాంటి వినియోగదారులు బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో ముందస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. జూలై నెలలో బ్యాంకులకు ఏకంగా 13 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. ఆ రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.

ఇది కూడా చదవండి: New Banking Charges: జూలై 1 నుండి బ్యాంకింగ్ నియమాలలో మార్పులు.. ATM, డెబిట్ కార్డులపై ఛార్జీల మోత!

జూలై 2025లో బ్యాంకు సెలవుల జాబితా

  1. 3 జూలై – ఖర్చీ పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు మూసివేయబడతాయి
  2. 5 జూలై – గురు హర్‌గోబింద్ జీ పుట్టినరోజు సందర్భంగా జమ్మూ శ్రీనగర్‌లో బ్యాంకులు బంద్ ఉంటాయి
  3. ఇవి కూడా చదవండి
  4. 6 జూలై – ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  5. 12 జూలై – నెలలో రెండో శనివారం దేశంలోని అన్ని బ్యాంకులకు హాలిడే
  6. 13 జూలై – ఆదివారం కారణంగా అన్ని బ్యాంకులకు వారాంతపు సెలవు
  7. 14 జూలై – బెహ్ దీంక్లాం కారణంగా షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు
  8. 16 జూలై – హరేలా పండుగ కారణంగా డెహ్రాడూన్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి
  9. 17 జూలై – ఉ తిరోత్ సింగ్ వర్ధంతి సందర్భంగా షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు
  10. 19 జూలై – కేర్ పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులకు హాలిడే
  11. 20 జూలై – ఆదివారం వారాంతపు సెలవు
  12. 26 జూలై – ఈ నెలలో నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  13. 27 జూలై – ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు హాలిడే
  14. 28 జూలై – ద్రుక్పా షె జీ సందర్భంగా గాంగ్‌టక్‌లో బ్యాంకులు బంద్ ఉంటాయి

బ్యాంకులు 13 రోజులు బంద్

ఆదివారం, రెండో, నాలుగో శనివారం కాకుండా, ఇతర ప్రత్యేక కారణాల వల్ల కూడా బ్యాంకులు మూసివేయబడవచ్చు. అయితే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గుర్తించుకోండి. అయితే బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌ సేవలు యధావిధిగా కొనసాగుతాయి.

ఇది కూడా చదవండి: FASTag: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. దేశంలో కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ రూల్స్‌.. కేవలం రూ.15కే టోల్‌ ఛార్జ్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి