AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Financial Planning: మీరు ఇలా చేస్తే మీ కూతురు 20 ఏళ్లలో లక్షాధికారి కావచ్చు!

Financial Planning: చాలా మంది తమ కూతురి భవిష్యత్తును మెరుగుపరచడానికి పెట్టుబడి ప్రణాళికల కోసం వెతుకుతూనే ఉంటారు. మీరు కూడా మీ కూతురి భవిష్యత్తును జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే మీరు ఈ రోజు నుండే ఆమె కోసం పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. ఈ..

Financial Planning: మీరు ఇలా చేస్తే మీ కూతురు 20 ఏళ్లలో లక్షాధికారి కావచ్చు!
Subhash Goud
|

Updated on: Jun 24, 2025 | 7:16 AM

Share

మీ కూతురి భవిష్యత్తు గురించి మీరు ఆందోళన చెందుతుంటే. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. 20 సంవత్సరాలలో కూతురి కోసం దాదాపు కోటి రూపాయలు జమ అవుతాయి. ప్రతి తల్లిదండ్రులు తమ కూతురి భవిష్యత్తు సురక్షితంగా ఉండటమే కాకుండా, ఆర్థికంగా కూడా బలంగా ఉండాలని కోరుకుంటారు. ఖర్చులు నిరంతరం పెరుగుతున్న నేటి యుగంలో ముందుగానే పెట్టుబడి పెట్టడం మంచిది. ఇది దీర్ఘకాలంలో పెద్ద నిధిని సృష్టించవచ్చు.

చాలా మంది తమ కూతురి భవిష్యత్తును మెరుగుపరచడానికి పెట్టుబడి ప్రణాళికల కోసం వెతుకుతూనే ఉంటారు. మీరు కూడా మీ కూతురి భవిష్యత్తును జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే మీరు ఈ రోజు నుండే ఆమె కోసం పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ కూతురు 20 సంవత్సరాలలో లక్షాధికారి కావచ్చు. ఇందులో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 కట్టడం ద్వారా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. గరిష్ట పెట్టుబడి రూ. 1.50 లక్షలుగా ఉంది. ఇక దీనిని ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి లేదా ఇన్‌స్టాల్‍‌మెంట్ల రూపంలో ఎన్ని సార్లయినా డిపాజిట్ చేయవచ్చు. నెలనెలా డిపాజిట్ చేయడం ద్వారా కాస్త సులభంగా ఉంటుంది.

భారత ప్రభుత్వం 2015 సంవత్సరంలో బేటీ బచావో బేటీ పఢావో ప్రచారం కింద సుకన్య సమృద్ధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు తమ కుమార్తె భవిష్యత్తును మెరుగుపరచడానికి మంచి మొత్తాన్ని ఆదా చేయవచ్చు. దీనిలో పన్ను మినహాయింపు కూడా అందుబాటులో ఉంది. భారత ప్రభుత్వం ఈ పథకం ప్రత్యేకంగా కుమార్తెల కోసం రూపొందించారు. దీనిలో మీరు చిన్న వయస్సులోనే ఖాతా తెరిచి దీర్ఘకాలం పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం పూర్తిగా సురక్షితమైనది. ప్రభుత్వ హామీ ఇస్తుంది.

ఈ పథకంలో మీరు ప్రతి సంవత్సరం రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెడితే. 20 నుండి 21 సంవత్సరాలలో ఈ నిధి లక్షల్లోకి మారవచ్చు. మీ కుమార్తె పుట్టిన వెంటనే మీరు దీనిలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే. 21 సంవత్సరాల పాటు 8.2 శాతం వడ్డీ రేటుతో మీరు దాదాపు రూ.70 లక్షలను దీనిలో డిపాజిట్ చేయవచ్చు. ఇందులో రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు.

రూ. 70 లక్షలు పొందడం ఎలా?

మీరు మీ ఆడపిల్ల కోసం రూ. 70 లక్షల నిధిని లక్ష్యంగా పెట్టుకుంటే, నెలకు రూ. 12,500 లేదా ఆర్థిక సంవత్సరంలో రూ. 1,50,000 పెట్టుబడి పెట్టాలి. 15 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ. 22,50,000 అవుతుంది. 8.20 శాతం వడ్డీ రేటుతో మీరు సుమారు రూ. 46,77,578 వడ్డీని పొందుతారు. మెచ్యూరిటీ నాటికి మీకు మొత్తం రూ. 69,27,578 అందుతుంది. ఇది దాదాపు రూ. 70 లక్షల నిధి అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు పెట్టే పెట్టుబడిని బట్టి రాబడి వస్తుందని గుర్తించుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..