April Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌లో బ్యాంకులకు వరుస సెలవులు

|

Mar 24, 2022 | 4:23 PM

April Bank Holidays: బ్యాంకుల విషయంలో రోజువారీ లావాదేవీలు ఇతర పనుల చేసేవారు బ్యాంకులకు సెలవులను గమనిస్తూ ఉండాలి. ప్రతి నెల..

April Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌లో బ్యాంకులకు వరుస సెలవులు
Follow us on

April Bank Holidays: బ్యాంకుల విషయంలో రోజువారీ లావాదేవీలు ఇతర పనుల చేసేవారు బ్యాంకులకు సెలవులను గమనిస్తూ ఉండాలి. ప్రతి నెల బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు (Holidays) ఉన్నాయి..? ఏయే రోజుల్లో ఉన్నాయనే విషయాలు ముందుగానే తెలుసుకుంటే బ్యాంకుకు సంబంధించిన పనులను ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవచ్చు. ఇక వచ్చే నెల అంటే ఏప్రిల్‌ నెలలో బ్యాంకు (Bank)లకు వరుసగా సెలవులు (Holidays) రానున్నాయి. బ్యాంకుల్లో ఏమైనా పనులు ఉంటే సెలవులకు ముందే త్వరగా పూర్తిగా చేసుకోండి. ఏప్రిల్ ఒక‌టో తేదీ.. నూత‌న ఆర్థిక సంవ‌త్స‌రం మొదటి రోజు. బ్యాంకింగ్‌తోపాటు ఇత‌ర రంగాల ఉద్యోగుల‌పై ప‌నిభారం వ‌ల్ల సెల‌వులు వ‌స్తాయ‌ని ఆశిస్తుంటారు. రోజువారీ కార్య‌క‌లాపాల్లో భాగంగా బ్యాంకులకు వెళ్లాల్సి రావ‌చ్చు. అయితే, మీరు బ్యాంకుకు వెళ్లాల‌నుకున్న‌ప్పుడు ఆ రోజు సెల‌వులేమైనా ఉన్నాయా అని ఒక్క‌సారి క్యాలెండ‌ర్ చెక్ చేసుకోవడం మంచిది. మొత్తం దేశ‌వ్యాప్తంగా వ‌చ్చే ఏప్రిల్‌ నెల‌లో 9 రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు ఉన్నాయి. ఏప్రిల్‌ ఒక‌టో తేదీ ఆర్థిక సంవ‌త్స‌రం తొలి రోజు.. అదే రోజు పాత ఆర్థిక సంవ‌త్స‌ర ఖాతాల ముగింపు కావ‌డంతో బ్యాంకులు ప‌ని చేయ‌వు. బెలాపూర్‌, బెంగ‌ళూరు, చెన్నై, హైద‌రాబాద్‌, ఇంఫాల్‌, జ‌మ్ము, ముంబై, నాగ్‌పూర్‌, ప‌నాజీ, శ్రీ‌న‌గ‌ర్‌ల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.

ఏప్రిల్ 2వ తేదీ మొదట శ‌నివారం అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సంవ‌త్స‌రాది. మ‌హారాష్ట్ర‌లో గుడి ప‌డ్వా, క‌ర్ణాట‌క‌లోనూ ఉగాది ప‌ర్వ‌దినం జ‌రుపుకుంటారు. అందుకే 2వ తేదీన కూడా బ్యాంకుల‌కు సెల‌వు ఉంటుంది.

ఏప్రిల్ 3వ తేదీన ఆదివారం వారాంత‌పు సెల‌వు. ఏప్రిల్ 14, 15 తేదీల్లో బ్యాంకుల‌కు సెల‌వు. 14వ తేదీన భార‌త రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్క‌ర్ జ‌యంతి, మ‌హావీర్ జ‌యంతి, త‌మిళ నూత‌న సంవ‌త్స‌రాది, వివిధ ప్రాంతాల్లో చైరావోబా, బిజు ఫెస్టివల్‌, బొహాగ్ బిహూ ఉత్స‌వాలు జ‌రిగే ప్రాంతాల్లో బ్యాంకులు ప‌ని చేయ‌వు.

15వ తేదీన గుడ్ ఫ్రైడేతోపాటు బెంగాల్ నూత‌న సంవ‌త్స‌రాది, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ దినోత్స‌వం సంద‌ర్భంగా బ్యాంకుల‌కు సెల‌వు ఉంటుంది.

17వ తేదీ ఆదివారం సెల‌వు. అంత‌కుముందు 9వ తేదీన రెండో శ‌నివారం, 10వ తేదీ ఆదివారం వారాంత‌పు సెల‌వుల సంద‌ర్భంగా బ్యాంకులు ప‌ని చేయ‌వు.

ఏప్రిల్ 23వ తేదీ నాలుగో శ‌నివారం, 24వ తేదీ ఆదివారం సంద‌ర్భంగా బ్యాంకులకు సెల‌వు ఉంటుంది. వీటిల్లో రెండో, నాల్గో శ‌నివారాలు, ఆదివారాలు మిన‌హా మిగ‌తా సెల‌వు దినాల్లో దేశ‌వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మే బ్యాంకులు ప‌ని చేస్తాయి. ప్ర‌భుత్వ, ప్రైవేట్‌, విదేశీ, స‌హ‌కార‌, ప్రాంతీయ బ్యాంకుల‌న్నింటికీ ఆర్బీఐ క్యాలెండ‌ర్ ప్ర‌కారం సెల‌వులు వ‌ర్తిస్తాయి. బ్యాంకుల సెల‌వుల‌ను రాష్ట్రాల వారీ పండుగ‌లు, ప్రాంతీయ సెల‌వులు, జాతీయ పండుగ‌లుగా ఆర్బీఐ నిర్ణయిస్తూ సెలవులను ప్రకటిస్తుంటుంది.

ఇవి కూడా చదవండి:

LIC Policy Holders: ఎల్‌ఐసీలో అలాంటి పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. మార్చి 25 చివరి తేదీ

Ather Energy: ఈ రెండు బ్యాంకులతో జతకట్టిన అథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. క్రెడిట్‌ స్కోర్‌ లేకున్నా రుణాలు