
Free Hospital Treatment: ఈ రోజుల్లో చాలా మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడున్న జనరేషన్‌లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఎందుకంటే మన రోజు తీసుకునే ఫుడ్, లైప్ స్టైల్‌ను బట్టి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చికిత్స కోసం ఆస్పత్రికి వెళితే లక్షల్లో బిల్లు సమర్పించుకోవాల్సిందే. ముఖ్యంగా పేదలు, మధ్య తరగతి కుటుంబాల వారికి పెద్ద సమస్య. ఎందుకంటే అంత బిల్లు చెల్లించుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో కేంద్రం జారీ చేసే ఈ కార్డు ఉంటే ఆస్పత్రిలో ఐదు లక్షల వరకు అయ్యే బిల్లు కూడా జీరో అవుతుంది.
ఇది కూడా చదవండి: Mukesh Ambani: అంబానీ ఇంట్లో చపాతీలు చేసే హెడ్ చెఫ్ జీతం ఎంతో తెలుసా? ప్యాకేజీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
హాస్పిటల్ బిల్లులు లక్షల్లో వస్తున్న ఈ రోజుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చికిత్స జరిగితే ఎలా ఉంటుంది? గుండె ఆపరేషన్లు, క్యాన్సర్ చికిత్స, డయాలసిస్ వంటి ఖరీదైన చికిత్సలు కూడా రూ.5 లక్షల వరకు ఉచితంగా పొందే అవకాశం ఉంది. ఇది ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్ యాడ్ కాదు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ యోజన (PMJAY). ఆయుష్మాన్ భారత్ అనేది భారత ప్రభుత్వమే పూర్తిగా నిధులు సమకూర్చే ఒక గొప్ప ఆరోగ్య సంరక్షణ పథకం.
చాలా మందికి తాము ఈ పథకానికి అర్హులా కాదా, ఎలా దరఖాస్తు చేయాలి? అసలు దాని ప్రయోజనం ఏమిటో తెలియదు. ఈ పథకం ఎలాంటి వయస్సు లేదా కుటుంబ పరిమితి లేకుండా, 100% నగదు రహిత చికిత్సను అందిస్తుంది. 1700లకు పైగా వైద్య సేవలు, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఉన్న వ్యాధులు కూడా కవర్ అవుతాయి.
ఇది కూడా చదవండి: House Build: ఈ మూడు రోజులలో ఇంటి నిర్మాణం చేస్తే ధనవంతులు అవుతారు..!
లబ్ధిదారులు తమ అర్హతను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు లేదా CSC కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ ఆధారిత ధృవీకరణ ద్వారా కుటుంబ సభ్యులను గుర్తించి, కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డుతో హాస్పిటల్ హెల్ప్ డెస్క్ వద్ద సంప్రదించి రూ.5 లక్షల వరకు నగదు రహిత చికిత్సను పొందవచ్చు. అత్యవసర పరిస్థితులలో ఆకస్మిక ఖర్చులు, పొదుపును హరించకుండా నిరోధించడానికి ఈ పథకం ఎంతో సహాయపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి