Business News: ఐడియా అదుర్స్ గురూ..! స్కాన్ చేస్తే సెకండ్స్‌లో టీ బిస్కెట్స్, కాఫీ, బాదం ఛాయ్..!

| Edited By: Balaraju Goud

Jun 11, 2024 | 4:31 PM

డిగ్రీ చదివి ఓ యువకుడు ఉపాధి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతున్న యువతను చూశాడు. తాను సొంతంగా వ్యాపారం చెయ్యాలని ఆలోచించాడు. ఏదైనా కొత్తగా వినూత్నంగా ఉండాలని ఆలోచించిన ఆ యువకుడు ఒక అత్యాధునిక టెక్నాలజీతో శ్రీకారం చుట్టాడు.

Business News: ఐడియా అదుర్స్ గురూ..! స్కాన్ చేస్తే సెకండ్స్‌లో టీ బిస్కెట్స్, కాఫీ, బాదం ఛాయ్..!
Coffee Maker Vending Machine With Wifi
Follow us on

డిగ్రీ చదివి ఓ యువకుడు ఉపాధి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతున్న యువతను చూశాడు. తాను సొంతంగా వ్యాపారం చెయ్యాలని ఆలోచించాడు. ఏదైనా కొత్తగా వినూత్నంగా ఉండాలని ఆలోచించిన ఆ యువకుడు ఒక అత్యాధునిక టెక్నాలజీతో శ్రీకారం చుట్టాడు. నేటి యువతను ఆకర్షించే WiFi డిజిటల్ నెట్‌వర్క్‌తో పని చేసే యంత్రాన్ని ఆవిష్కరించాడు. మనిషితో అవసరం లేకుండా టీ, కాపీ వచ్చేలా తయారు చేశాడు. మొబైల్ ఫోన్ తో స్కాన్ చేస్తే చాలు, ఆ వ్యక్తికి కావాల్సిన టీ, కాఫీ వచ్చేలా చేశాడు. అంతేకాదు వాటర్, బాదం టీ, బిస్కట్లు కూడా ఆ మిషన్ లో నుంచి వచ్చేస్తున్నాయి.

ఇదంతా ఎక్కడో కాదు…! ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలోని ప్రయాణికుల ప్రాంగణంలో ప్రయాణికుల సౌకర్యార్థం నిరుద్యోగ యువకుడు ప్రేమ్ కుమార్ అద్బుత రూపకల్పన చేశాడు. లేటెస్ట్ ట్రెండ్ wifi డిజిటల్ టెక్నాలజీ మిషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చాడు. 24 గంటలు అందుబాటులో ఉంటూ.. ఆర్టీసీ బస్ స్టేషన్‌లో ప్రయాణికులకు టీ, కాఫీ, వాటర్ బాటిల్, బాదం పాలు, బిస్కట్లు ఇచ్చేలా ఒక డిజిటల్ మిషన్ ఏర్పాటు చేశాడు. అత్యాధుని టెక్నాలజీని ఉపయోగించి ప్రోగ్రామింగ్ ఫీడ్ చేసి అమర్చారు. దాదాపు 4 లక్షల రూపాయల విలువ చేసే ఒక మిషనరీని ప్రేమ్ కుమార్ ఏర్పాటు చేశాడు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఆర్టీసీ బస్ స్టేషన్ లలో ఎక్కడ లేదని, మొట్ట మొదటిగా సత్తుపల్లి ఆర్టీసీ డిపో లో ఏర్పాటు చేసినట్లు ప్రేమ్ కుమార్ తెలిపారు. దీంతో ఉపాధి పొందుతున్నట్లు ఆనందం వ్యక్తం చేశాడు. ప్రయాణికులు చిల్లర కావాలని ఆందోళన చెందే పరిస్థితి ఉండదు అంటున్నాడు. తమ మొబైల్ ఫోన్ లో బార్ కోడ్ స్కానింగ్ చేస్తే.. టీ, కాఫీ ఇలా.. ఏదైనా మనిషి లేకుండానే ఆ ఆటో మేటిక్ wifi డిజిటల్ టెక్నాలజీ మిషన్ తో ఆర్టీసీ ప్రయాణికులకు సర్వీసు అందిస్తుంది. ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ప్రయాణికులు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..