Auto News: 20 నిమిషాల్లో ఛార్జ్.. 683 కి.మీ రేంజ్.. మహీంద్రా ఎలక్ట్రిక్ SUVపై రూ.2 లక్షల డిస్కౌంట్..!

ఈ కారులో సెక్యూరిటీ పరంగా ఈ కారులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో లెవెల్-2 ADAS (అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్, ఆటో లేన్ చేంజ్) సదుపాయం ఉంది. అలాగే 360° కెమెరా, ఆటో పార్క్ అసిస్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్, OTA అప్‌డేట్స్, AR HUD, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉన్నాయి. ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి రేంజ్, ఎవ్రీడే, రేస్ అనే డ్రైవ్ మోడ్స్‌తో పాటు బూస్ట్ బటన్ కూడా ఇచ్చారు. ఇక సేఫ్టీ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు,

Auto News: 20 నిమిషాల్లో ఛార్జ్.. 683 కి.మీ రేంజ్..  మహీంద్రా ఎలక్ట్రిక్ SUVపై రూ.2 లక్షల డిస్కౌంట్..!
Mahindra Be 6

Updated on: May 17, 2026 | 1:46 PM

Auto News: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మహీంద్రా సంస్థ తన సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను ఎక్కువ మంది వినియోగదారులకు చేరువ చేయడానికి మే 2026లో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ భారీ ఆఫర్ లభిస్తున్న కార్ల జాబితాలో మహీంద్రాకు చెందిన మోస్ట్ స్టైలిష్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘మహీంద్రా బిఈ 6’ (Mahindra BE 6) ముందు వరుసలో ఉంది. కంపెనీ తన MY2025 మోడల్స్ పై క్యాష్ డిస్కౌంట్ రూపంలో ఏకంగా రూ. 2 లక్షల వరకు బంపర్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఆఫర్ పరిమిత స్టాక్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ 31 మే 2026 వరకు మాత్రమే వాలిడ్ అవుతుందని కంపెనీ స్పష్టం చేసింది.

మరికొన్ని డీలర్‌షిప్‌ల వద్ద ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా యాక్ససరీస్ రూపంలో అదనపు బెనిఫిట్స్ కూడా పొందే అవకాశం ఉంది. కొత్తగా వచ్చే MY2026 మోడల్స్‌పై డిస్కౌంట్లు చాలా తక్కువగా లేదా అసలు ఉండకపోవచ్చు. అందుకే కారు కొనే ముందు మీ దగ్గరలోని డీలర్‌ను సంప్రదించడం మంచిది. మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, లాంగ్ రేంజ్‌తో వచ్చే BE 6 కారుకు ఈ ఆఫర్ మరింత ‘వాల్యూ ఫర్ మనీ’గా మారుస్తుందనడంలో సందేహం లేదు. ఈ కారు ధర, రేంజ్, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేద్దాం..

ధరల వివరాలు:

మహీంద్రా BE 6 ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.90 లక్షల నుండి ప్రారంభమై, టాప్ వేరియంట్ కోసం రూ. 28.49 లక్షల వరకు ఉంటుంది. ఆన్-రోడ్ ధర (ఢిల్లీ) సుమారు రూ. 20-30 లక్షల మధ్య ఉండవచ్చు. బ్యాటరీ, ఛార్జర్ ఆప్షన్లను బట్టి ధరలలో మార్పులు ఉంటాయి. ప్రస్తుతం MY2025 స్టాక్‌పై లభిస్తున్న రూ. 2 లక్షల డిస్కౌంట్ వల్ల ఈ కారు మరింత తక్కువ ధరకే లభించనుంది.

ఇవి కూడా చదవండి

ఫ్యూచరిస్టిక్ డిజైన్

మహీంద్రా BE 6 డిజైన్ చాలా బోల్డ్, ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. రోడ్డుపై వెళ్తుంటే అందరి దృష్టిని ఆకర్షించేలా దీనిని రూపొందించారు. ఇందులో C-షేప్డ్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ (LED DRLs) ఉన్నాయి. కూపే-స్టైల్ స్లోపింగ్ రూఫ్‌లైన్, హిడెన్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్ స్పాయిలర్స్ ఉన్నాయి. అలాగే ఏరో-ఫ్రెండ్లీ 19-ఇంచ్ అలాయ్ వీల్స్, ఫుల్-లెంత్ ఎల్ఈడీ టెయిల్‌లైట్ బార్ దీనికి స్పోర్టీ లుక్ ఇస్తాయి. ఇది మహీంద్రా ప్రత్యేకమైన INGLO ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించారు. దీని పొడవు 4371 mm, వీల్‌బేస్ 2775 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 207 mm గా ఉంటుంది.

కేబిన్, కంఫర్ట్

ఈ కారు కేబిన్ చాలా ప్రీమియం, టెక్నాలజీతో నిండి ఉంటుంది. డ్యూయల్ 12.3-ఇంచ్ డిజిటల్ స్క్రీన్స్, ఇల్యూమినేటెడ్ టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ (BE లోగోతో) ఆకట్టుకుంటాయి. పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, హర్మాన్ కార్డన్ 16-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. డోర్ హ్యాండిల్స్ స్ట్రాప్-స్టైల్‌లో ఉండి, కేబిన్ చాలా విశాలంగా అనిపిస్తుంది. అయితే వెనుక సీట్లో హెడ్‌రూమ్ పొడవుగా ఉండే ప్రయాణికులకు కొంచెం టైట్‌గా అనిపించవచ్చు. దీని బూట్ స్పేస్ 455 లీటర్లు.

ఫీచర్స్, సేఫ్టీ:

సెక్యూరిటీ పరంగా ఈ కారులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో లెవెల్-2 ADAS (అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్, ఆటో లేన్ చేంజ్) సదుపాయం ఉంది. అలాగే 360° కెమెరా, ఆటో పార్క్ అసిస్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్, OTA అప్‌డేట్స్, AR HUD, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉన్నాయి. ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి రేంజ్, ఎవ్రీడే, రేస్ అనే డ్రైవ్ మోడ్స్‌తో పాటు బూస్ట్ బటన్ కూడా ఇచ్చారు. ఇక సేఫ్టీ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ABSతో కూడిన EBD, ESP, TPMS, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు ఉన్నాయి. బ్యాటరీ, మోటార్, రేంజ్ విషయానికొస్తే.. ఈ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

  • 59 kWh బ్యాటరీ: ఇది 231 hp పవర్ ఇస్తుంది. దీని ARAI రేంజ్ 557 కిలోమీటర్లు.
  • 79 kWh బ్యాటరీ: ఇది 282 hp పవర్ ఇస్తుంది. దీని ARAI రేంజ్ ఏకంగా 683 కిలోమీటర్లు.

వినియోగదారులు దీనిని రియర్-వీల్ డ్రైవ్ (RWD), ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. మహీంద్రా BE 6 కేవలం 6.7 సెకన్లలోనే 0-100 km/h వేగాన్ని అందుకుంటుంది. అంతేకాదు, 175 kW DC ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో ఈ కారును కేవలం 20 నిమిషాల్లోనే 20% నుండి 80% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. లగ్జరీ లుక్స్, అదిరిపోయే రేంజ్, సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉన్న ఎలక్ట్రిక్ కారును రూ. 2 లక్షల భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవడానికి ఇదొక సువర్ణావకాశం. ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి ఈ మే నెల ఆఫర్ పర్‌ఫెక్ట్ ఛాయిస్‌ అనే చెప్పాలి.

ఇది కూడా చదవండి: Success Story: ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెలకు రూ. 7 లక్షల సంపాదన.. 19 ఏళ్ల కుర్రాడి ‘గ్లామరస్’ సక్సెస్ స్టోరీ!

ఇది కూడా చదవండి: Indian Railways: తత్కాల్ టికెట్లు బుక్ కావట్లేదా? వేగం ఒక్కటే సరిపోదు.. ఈ ‘సీక్రెట్ ట్రిక్స్’ పాటిస్తే కన్ఫర్మ్ సీట్ మీదే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us