భారతదేశంలో ఈవీ మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి రక్షణకు సామాన్య ప్రజలు ఈవీ వాహనాల వాడాకాన్ని ఇష్టపడుతున్నారు. గతంలో పట్టణ ప్రాంత ప్రజలే ఎక్కువగా ఈవీ వాహనాలను కొనుగోలు చేసే వారు. అయితే పెరిగిన టెక్నాలజీతో ఫీచర్ల కారణంగా గ్రామీణులు కూడా ఈవీ వాహనాలను ఇష్టపడుతున్నారు. మొదట్లో ఈవీ వాహనాలు కాలిపోతాయనే పుకార్ల వల్ల గ్రామీణులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. క్రమేపీ ఈవీ వాహనాలపై నమ్మకం పెరగడంతో ఈవీ వాహనాల కొనుగోళ్ల జోరు నడుస్తుంది. కంపెనీలు కూడా పెరిగిన డిమాండ్ నేపథ్యంలో అందరికీ అందుబాటు ధరలో ఈవీ వాహనాలకు రిలీజ్ చేస్తున్నాయి. భారత ఈవీ మార్కెట్‌లో ఓలా వాహనాలు తమ హవా చూపుతున్నాయి. ఇటీవల ఓలా ఎస్1 ఎక్స్ పేరుతో ఓ స్కూటర్ రిలీజ్ చేసింది. అలాగే సింపుల్ వన్ కూడా మరో స్కూటర్ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఏథర్ కంపెనీ కూడా ఈ రెండు స్కూటర్లకు పోటీగా ఏథర్ 450 ఎస్ హెచ్‌ఆర్ పేరుతో మరో స్కూటర్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా మైలేజ్‌తో పాటు ఫీచర్ల విషయంలో ఈ స్కూటర్ అందిరనీ ఆకట్టుకుంటుందని ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ నయా స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
భారతీయ ఈ-స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన సరసమైన 450ఎస్ మోడల్‌లో కొత్త వైవిధ్యమైన 450 ఎస్ హెచ్‌ఆర్ త్వరలో విడుదల చేస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ స్కూటర్ 3.67 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత 450 ఎస్ కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చేలా ఈ నయా స్కూటర్ ఉంది. ఏథర్ 450 ఎస్ హెచ్‌ఆర్ ఒక ఛార్జ్‌పై 156కిమీల పరిధిని అందిస్తుంది. ఈ పరిధి 450 ఎక్స్ జెన్ 3తో పోలిస్తే మరో 10 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. దీని నిజమైన పరిధి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 110కిలోమీటర్లుగా అంచనా వేస్తున్నారు. ఈ కొత్త మోడల్‌లో నికెల్, కోబాల్ట్-ఆధారిత లి-అయాన్ బ్యాటరీ, స్పోర్ట్స్ మోడ్‌లో 7.24 హెచ్‌పీ గరిష్ట శక్తిని అందించే మూడు దశల పీఎంఎస్ మోటారుతో పని చేస్తుంది.
ఏథర్ 450 ఎస్ హెచ్‌ఆర్ కొత్త 7 అంగుళాల డీప్‌వ్యూ ప్యానెల్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. నాన్-టచ్-బేస్డ్ డిస్‌ప్లేతో పాటు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో బ్లూటూత్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే ఈ స్కూటర్‌లో గూగుల్ మ్యాప్స్‌కు మద్దతిచ్చే అధునాతన 7 అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది. ముఖ్యంగా ఈ స్కూటర్ ఫీచర్లు గతంలో ఏథర్ రిలీజ్ చేసిన ఇతర స్కూటర్ల కంటే భిన్నంగా ఉంటాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..