Apple: యాపిల్‌ యూజర్లకు బ్యాడ్‌ న్యూస్‌.. ఆ సదుపాయానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ నిర్ణయం..

|

May 06, 2022 | 12:00 PM

Apple: భారత్‌లో యాపిల్‌ ప్రొడెక్ట్స్‌ కానీ, సబ్‌స్క్రిప్షన్లను పొందే వారు ఇకపై క్రెడిట్‌ కార్డుల ద్వారా లావాదేలీలు చేసుకోలేరు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల క్రెడిట్‌ కార్డుల ద్వారా పేమెంట్స్‌ను యాపిల్‌ నిలిపివేసింది. జూన్‌ 1వ తేదీ నుంచి క్రెడిట్‌ కార్డుల చెల్లింపులను...

Apple: యాపిల్‌ యూజర్లకు బ్యాడ్‌ న్యూస్‌.. ఆ సదుపాయానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ నిర్ణయం..
Follow us on

Apple: భారత్‌లో యాపిల్‌ ప్రొడెక్ట్స్‌ కానీ, సబ్‌స్క్రిప్షన్లను పొందే వారు ఇకపై క్రెడిట్‌ కార్డుల ద్వారా లావాదేలీలు చేసుకోలేరు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల క్రెడిట్‌ కార్డుల ద్వారా పేమెంట్స్‌ను యాపిల్‌ నిలిపివేసింది. జూన్‌ 1వ తేదీ నుంచి క్రెడిట్‌ కార్డుల చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు యాపిల్‌ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే యాపిల్‌ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం.. గతేడాది ఆర్బీఐ అమల్లోకి తీసుకొచ్చిన ఆటో డెబిట్‌ విధానమే. దీనివల్ల రిక‌రింగ్ ఆన్‌లైన్ లావాదేవీల్లో అంత‌రాయం ఏర్పడుతుందని విమర్శలు వచ్చిన నేపథ్యంలో యాపిల్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

క్రెడిట్‌ కార్డుల చెల్లింపులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన యాపిల్ తమ యూజర్లకు ఈ విషయాన్ని మెయిల్‌ ద్వారా తెలిపింది. జూన్‌ ఒకటో తేదీని క్రెడిట్‌ కార్డు లావాదేవీలన్నీ హోల్డ్‌లో ఉంచుతామని తెలిపారు. యాపిల్ తీసుకున్న ఈ నిర్ణయంతో యూజర్లు ఐక్లౌడ్‌, ఐట్యూన్స్‌ వంటి కొన్ని పెయిడ్‌ సేవలను కొనసాగించలేరు. అయితే కార్డు ద్వారా కాకుండా యూపీఐ, నెట్‌ బ్యాంకింగ్ మాత్రమే యాపిల్‌ ఐడీ ఖాతాకు సంబంధించిన చెల్లింపులు చేసుకోవడానికి యాపిల్‌ అనుమతిచ్చింది. దీంతో యాపిల్ తీసుకున్న ఈ నిర్ణయంపై యూజర్లు సోషల్‌ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Viral Video: వరుడు రావడం కాస్త ఆలస్యం అయిందని.. ఆ వధువు ఏం చేసిందో చూడండి..!

Mahesh Babu: మహేష్ రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్

Afghan Crisis: మహిళలపై మరోసారి కఠిన ఆంక్షలు విధించిన తాలిబన్లు.. ఈసారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..