Apple Products: ఆపిల్ ఉత్పత్తులపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.10 వేల వరకు తగ్గింపు

ప్రస్తుత రోజుల్లో యువత ఎక్కువగా ఆపిల్ ఉత్పత్తులపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. ఆపిల్ ప్రొడెక్ట్స్ వాడితే అదో గౌరవం కింద ఫీలయ్యే వారు చాలా మంది ఉన్నారు. అయితే మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో ఆపిల్ కంపెనీ ఆపిల్ డేస్ పేరుతో ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తుంది. కొన్ని ప్రొడెక్ట్స్ ఏకంగా రూ.10 వేల వరకు తగ్గింపును ప్రకటించింది.

Apple Products: ఆపిల్ ఉత్పత్తులపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.10 వేల వరకు తగ్గింపు
Apple Days

Updated on: May 27, 2025 | 7:30 PM

విజయ్ సేల్స్ తన ఆపిల్ డేస్ ప్రమోషన్‌ను ప్రారంభించింది. ఇందులో వివిధ రకాల అద్భుతమైన డీల్స్, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు ఉన్నాయి. పరిమిత-కాల సేల్ తాజా ఐఫోన్ 16 సిరీస్, బడ్జెట్-ఫ్రెండ్లీ ఐఫోన్ 15 లైనప్, మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్, ఎయిర్‌పాడ్‌ల వంటి ప్రొడెక్టులపై టాప్ ఆఫర్స్ ప్రకటించింది. జూన్ 1, 2025 వరకు కొనుగోలుదారులు దేశవ్యాప్తంగా ఈ ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవచ్చు. విజయ్ సేల్స్ ఐసీఐసీ, యాక్సిస్ లేదా కోటక్ బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే ఎంపిక చేసిన మ్యాక్ బుక్ మోడళ్లపై రూ. 10,000 వరకు తక్షణ పొదుపును అందిస్తోంది. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్ బుక్స్, ఆపిల్ వాచీలు, ఎయిర్ పాడ్స్, బీట్స్ ఉపకరణాలతో సహా విస్తృత శ్రేణి ఆపిల్ గాడ్జెట్‌లపై ఆఫర్లను అందిస్తుంది. 

మ్యాక్‌బుక్ ప్రో ఆఫర్లు 

విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ ప్రమోషన్‌లో భాగంగా ఎం4 చిప్‌‌సెట్‌తో వచ్చే మ్యాక్‌బుక్ ప్రో ప్రారంభ ధర రూ. 1,45,900గా ఉంది. ఎం4 ప్రో ప్రాసెసర్‌ వేరియంట్ రూ. 1,72,400 నుంచి ప్రారంభమవుతుంది. ఎం4 మ్యాక్స్-ఆధారిత మ్యాక్‌బుక్ ప్రో రూ. 2,78,900 నుంచి అందుబాటులో ఉంది. ఎం4, ఎం2 చిప్‌లతో కూడిన మ్యాక్‌బుక్ ఎయిర్ మోడళ్లపై ప్రత్యేక ఆఫర్‌లు ప్రకటించారు.

ఆపిల్ వాచ్ సిరీస్ 10 ఆఫర్లు 

స్మార్ట్ వాచ్ విభాగంలో ఆపిల్ వాచ్ సిరీస్ 10 రూ. 40,600 నుండి ప్రారంభమవుతుంది. అయితే ఆపిల్ వాచ్ SE (2వ జనరేషన్) రూ. 20,900 నుండి లభిస్తుంది. హై-ఎండ్ ఆపిల్ వాచ్ అల్ట్రా 2 ధర రూ. 79,700 నుండి ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

ఐఫోన్ 16 ప్రో ఆఫర్లు 

విజయ్ సేల్స్ ఎయిర్‌పాడ్స్ 4 పై డిస్కౌంట్‌ను రూ. 10,900 కు తగ్గించింది. అంటే దాదాపు ఎయిర్ పాడ్స్‌పై రూ. 15 వేలు తగ్గింపును అందించారు. ఎయిర్‌పాడ్స్ ప్రో (సెకండ్ జెనరేషన్) రూ. 20,900కు అందిస్తున్నారు. బీట్స్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌ల ధరలు ఈ సేల్ సమయంలో కనీసం రూ. 5,500 కు తగ్గుతాయి. విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ ఈవెంట్ సందర్భంగా ఐఫోన్ 16 ప్రో ఫోన్ ధరను రూ.1,09,490కు తగ్గించారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ ఇతర ఎంపిక చేసిన కార్డులతో చెల్లించేటప్పుడు కొనుగోలుదారులు రూ.4,500 వరకు అదనపు బ్యాంక్ డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. 

ఐఫోన్ 16 ఆఫర్లు 

128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చే ఐఫోన్ 16 బేస్ మోడల్ ఇప్పుడు రూ.66,990 కు లభిస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.79,900గా ఉండేది. ఈ డీల్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్ లేదా కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డులను ఉపయోగించే కస్టమర్లకు ఇన్‌స్టంట్ రూ.4,000 తగ్గింపు లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి