ఏపీలో వారందరీ అకౌంట్లోకి రూ.15 వేలు.. ప్రభుత్వం లైన్ క్లియర్.. జమ అయ్యేది అప్పుడే..!

ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్దమైంది. త్వరలోనే వారి అకౌంట్లలో రూ.15 వేలు జమ చేేయనుంది. ఇప్పటికే నిధులు మంజూరు చేయడంతో త్వరలోనే లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో వేసే అవకాశముంది. దీని వల్ల ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు నిధులు అందనున్నాయి.

ఏపీలో వారందరీ అకౌంట్లోకి రూ.15 వేలు.. ప్రభుత్వం లైన్ క్లియర్.. జమ అయ్యేది అప్పుడే..!
Auto Drivers Sevalo

Updated on: Nov 18, 2026 | 4:25 PM

ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే సూపర్‌న్యూస్ అందించింది. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు త్వరలో రూ.15 వేలు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆర్ధిక సాయం అందించేందుకు నిధులు రిలీజ్ చేసింది. కూటమి ప్రభుత్వం ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ప్రతీ ఏడాది రూ.15 వేలు అందిస్తోంది. గత ఏడాది అందించగా.. ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను స్కీమ్ అమలు కోసం తాజాగా రూ.231.13 కోట్ల నిధులు విడుదల చేసింది. దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలోనే వీటిని లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్లు నిధుల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రకటన రావడంతో ఊరట చెందుతున్నారు.

ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.15 వేలు..

ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ నడుపుతున్న అర్హులైన డ్రైవర్లకు ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. క్యాబ్ డ్రైవర్ల ఆర్ధిక అవసరాల కోసం ఇవి ఉపయోగపడనున్నాయి. ఇందుకోసం ఆట్, క్యాబ్ డ్రైవర్లు స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తమ క్యాబ్‌కు సంబంధించిన పత్రాలు, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. అధికారులు పరిశీలించి అర్హతలన్నీ ఉంటే లబ్దిదారుల జాబితాలో చేరుస్తారు. సొంత వాహనం కలిగి ఉన్నవారికి మాత్రమే ఇవి అందుతాయి. గతంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను కూడా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. సంక్రాంతికి ముందే వీటిని విడుదల చేసే అవకాశముంది.

అర్హతలు ఏంటంటే..?

ఆటో డ్రైవర్ల సేవలో పథకం నిధుల విడుదల కోసం పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. గత ఏడాది ఈ పథకాన్ని ప్రారంభించగా.. తొలి ఏడాది 2.90 లక్షల మంది డ్రైవర్లకు లబ్ది చేకూరింది. ఇందులో ఆటో డ్రైవర్లు 2.64 లక్షల మంది ఉండగా.. ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు. వాహనం తమ పేరుపై ఉండి దానిని నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వెనుకబడిన తరగతులవారికి ఈ సాయం అందిస్తున్నారు. వెహికల్ రిజిస్ట్రేషన్ ఏపీలో జరగడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే ఈ పథకానికి సంబంధించి ఫిర్యాదుల కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. దీని ద్వారా తమ ఫిర్యాదులను లబ్దిదారులు పరిష్కరించుకోవచ్చు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us