Jaunty I Pro: ఈవీ మార్కెట్‌లో మరో స్టార్టప్ ఎంట్రీ.. టాప్ కంపెనీలకు పోటీగా సూపర్ ఈవీ స్కూటర్ లాంచ్

|

Apr 07, 2024 | 6:40 PM

తాజాగా నోయిడాకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ స్టార్టప్ ఏఎంఓ మొబిలిటీ జాంటీ ఐ ప్రో పేరుతో సరికొత్త హై-స్పీడ్ స్మార్ట్ టూ-వీలర్‌ను పరిచయం చేసింది. దీని ధర రూ.1.15 లక్షలుగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ కొత్త మోడల్ టైర్-I, టైర్-II నగరాల్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను, అలాగే చివరి-మైల్ డెలివరీ సెక్టార్‌ను తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది.

Jaunty I Pro: ఈవీ మార్కెట్‌లో మరో స్టార్టప్ ఎంట్రీ.. టాప్ కంపెనీలకు పోటీగా సూపర్ ఈవీ స్కూటర్ లాంచ్
Jaunty I Pro
Follow us on

ప్రపంచవ్యాప్తంగా ఈవీ స్కూటర్లకు ఆదరణ పెరుగుతుంది. భారతదేశంలో కూడా ఈవీ బైక్స్‌తో పోలిస్తే ఈవీ స్కూటర్ల అమ్మకాలు రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ సరికొత్త ఈవీ స్మార్ట్ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా నోయిడాకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ స్టార్టప్ ఏఎంఓ మొబిలిటీ జాంటీ ఐ ప్రో పేరుతో సరికొత్త హై-స్పీడ్ స్మార్ట్ టూ-వీలర్‌ను పరిచయం చేసింది. దీని ధర రూ.1.15 లక్షలుగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ కొత్త మోడల్ టైర్-I, టైర్-II నగరాల్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను, అలాగే చివరి-మైల్ డెలివరీ సెక్టార్‌ను తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. తెలుపు, నీలం, బూడిద రంగుల్లో లభిస్తుంది. ఈ నేపథ్యంలో జాంటీ ఐ ప్రో గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

జాంటీ ఐ ప్రో స్కూటర్ ఏఎంఓ మొబిలిటీ 200 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌ల ద్వారా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. వేగంగా విస్తరిస్తున్న భారతీయ ఈవీ మార్కెట్‌లో 50 శాతం వాటాను లక్ష్యంగా చేసుకుని ఈ స్వదేశీ మోడల్ లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.  2025 ఆర్థిక సంవత్సరంలో జాంటీ ఐ ప్రోకు సంబంధించిన 30,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చస్తే 120 కిమీ పరిధిని అందిస్తుంది. స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో పాటు 2.52 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్కూటర్ వేగవంతమైన ఛార్జర్‌ ద్వారా దాదాపు 3.5 గంటల్లో పూర్తిగా ఛార్జింగ్ అవుతుది. అదనంగా వాహనం మూడు-స్పీడ్ మోడ్‌లను అందిస్తుంది. ఎకనామిక్, సిటీ రైడ్, పవర్ మోడ్ ఎంపికల్లో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. 

భద్రత పరంగా జాంటీ ఐ ప్రో యాంటీ-ఫ్లేమ్ పాటింగ్ మెటీరియల్, టెంపరేచర్ అలర్ట్ బజర్‌తో కూడిన అధునాతన బ్యాటరీ సాంకేతికతనతో వస్తుంది. ముఖ్యంగా ఈ స్కూటర్ సీఏఎన్ 2.0బీ ప్రోటోకాల్‌తో పాటు ఒక అధునాతన కాంబినేషన్ బ్రేకింగ్ సిస్టమ్, రైడర్ భద్రత మరియు సౌకర్యాన్ని నిర్ధారించడానికి భద్రతా కమ్యూనికేషన్ సిస్టమ్‌లను కూడా కలిగి ఉంది. ఈ సరికొత్త స్కూటర్‌తో భారతదేశంలోని పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతా మార్కెట్‌ను కైవసం చేసుకుంటామని ఏఎంఓ మొబిలీ వ్యవస్థాపకుడు సుశాంత్ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఏఎంఓ మొబిలిటీ స్థానికంగా తయారు చేసిన భాగాల వినియోగంతో పాటు సమగ్ర వారంటీ ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని వివరించారు. కొత్త ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్‌కు సంబంధించిన మార్గదర్శకాలకు దగ్గరగా ఉండే  స్థానిక సహకారాన్ని కొనసాగించాలని యోచిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి