Anand Mahindra: అద్భుతమైన సక్సెస్ ఫార్ములా చెప్పిన ఆనంద్ మహీంద్రా.. ఇది అందరకీ ఉపయోగకరమైనదే..

Anand Mahindra: వ్యాపార నిర్వహణ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాకు(Social Media) ఏ మాత్రం దారంగా ఉండరు ఆ దిగ్గజ వ్యాపార వేత్త. ఆయనే మన ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా.

Anand Mahindra: అద్భుతమైన సక్సెస్ ఫార్ములా చెప్పిన ఆనంద్ మహీంద్రా.. ఇది అందరకీ ఉపయోగకరమైనదే..
Anand Mahindra

Updated on: Mar 28, 2022 | 1:35 PM

Anand Mahindra: వ్యాపార నిర్వహణ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాకు(Social Media) ఏ మాత్రం దారంగా ఉండరు ఆ దిగ్గజ వ్యాపార వేత్త. ఆయనే మన ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా. తన దృష్టికి వచ్చి ప్రతిభను దేశంలో ఏ మూలన ఉన్నా.. ప్రోత్సహించటంలో అంరికంటే ముందు ఉంటారు ఆయన. నెట్టింట్లో పెట్టే వాటి నుంచి చాలా సార్లు స్పూర్తి పొందుతుంటారు. తాను నేర్చుకున్న దానిని పంచుకోవటంతో పాటు.. మంచి బిజినెస్ పాఠాలు(Business Ideas) కూడా చెబుతుంటారు. దేశంలో అంత సక్సెస్‌ఫుల్‌ పర్సన్‌ ఇచ్చే సూచనలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా మనం చెప్పుకోనవసరం లేదు.

తాజాగా.. టీమ్‌ వర్క్‌కి సంబంధించి ఒక ఐడియాను ఆనంద్‌ మహీంద్రా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇందుకు ఒక వీడియోను ఉదాహరణగా తన పోస్ట్ లో జోడించారు. అదేంటంటే.. ఓ పార్కింగ్‌ స్లాట్‌లో ఒక చిన్న తినే పదార్ధం కోసం ఒక పిల్లి, రెండు కాకులు పోటీ పడుతుంటాయి. అప్పటికే ఆ ఆహార పదార్ధం పిల్లి నోటికి అందేంత దగ్గరలోనే ఉంటుంది. కానీ.. అక్కడ ఉన్న రెండు కాకులు ఒక టీమ్‌గా పని చేసి.. ఆ ఆహార పదార్థాన్ని పిల్లి దగ్గర నుంచి లాక్కుంటాయి. ఇక్కడ బలం కన్నా కలిసి పనిచేయటం వల్ల ఎలా విజయం సాధించవచ్చు అనేది మనందరం నేర్చుకోవాలని ఆనంద్ మహీంద్రా తన ఫాలోవర్స్ కు సూచించారు. అద్బుత ఫలితాలను సాధించటానికి టీమ్ వర్క్ ఎలా ఉపయోగపడుతుందో గ్రహించాలని ఆయన వ్యాఖ్యానించారు. పని ఏదైనా, ఎంత కష్టమైనదైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనకు అనుకూలంగా ఫలితాలు వచ్చేలా చేసుకోవాలంటే ఒంటరిగా కన్నా టీమ్ గా పనిచేస్తే విజయం తప్పదని ఈ వీడియో ద్వారా అందరూ తెలుసుకోవాలని మహీంద్రా అంటున్నారు. Monday morning అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ పోస్ట్ చేశారు మహీంద్రా.

ఇవీ చదవండి..

Credit Score: మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా లోన్ రిజెక్ట్ అవుతోందా..? అయితే ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి..

Markets: నష్టాలతో వారం ప్రారంభం.. నెగెటివ్‌లో ట్రేడ్ అవుతున్న సూచీలు..