
భారతదేశంలోని ఇద్దరు అతిపెద్ద వ్యాపార దిగ్గజాలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ. వారి వారి పరిశ్రమలలో ఉన్నత స్థానంలో ఉన్నారు. కానీ వారి కుమారుల వివాహాల విషయానికి వస్తే, వారిద్దరూ పూర్తిగా భిన్నమైన మార్గాలను ఎంచుకున్నారు. ఒకవైపు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంతర్జాతీయ తారలు హాజరైన గ్రాండ్, ఖరీదైన వివాహం అయితే, మరోవైపు, గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ వివాహం సరళత, సాంప్రదాయ విలువలకు ఉదాహరణగా నిలిచింది.
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన కాబోయే భార్య రాధిక మర్చంట్‌ను జూలై 2024లో వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో జీత్ అదానీ, దివా షా వివాహం ఫిబ్రవరి 7, 2024న జరిగింది/ ఇది చాలా ప్రైవేట్‌గా, సాంప్రదాయ పద్ధతిలో జరిగింది.
వాళ్ళ పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారు?
అనంత్ అంబానీ వివాహ అంచనా వ్యయం రూ.5,000 కోట్లు (US$600 మిలియన్లు) వరకు చేరుకుంది. మరోవైపు, జీత్ అదానీ వివాహం ఎటువంటి గొప్ప వేడుకలు లేకుండా చాలా సాధాసీదాగా జరిగింది. అంబానీ కుటుంబం మార్చి 2024లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 100 మిలియన్ US$ (సుమారు రూ. 800 కోట్లు) ఖర్చుతో గ్రాండ్ ప్రీ-వెడ్డింగ్ పార్టీని నిర్వహించింది. దీనికి ప్రపంచంలోని అతిపెద్ద వ్యక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి 100 కి పైగా ప్రైవేట్ జెట్‌లు వచ్చాయి. అలాగే రిహన్న, దిల్జిత్ దోసాంజ్ వంటి కళాకారులు ప్రదర్శన ఇచ్చారు.
మరోవైపు, జీత్ అదానీ వివాహం అహ్మదాబాద్‌లోని శాంతిగ్రామ్ టౌన్‌షిప్‌లోని బెల్వెడెరే క్లబ్‌లో జరిగింది. ఇది చాలా ప్రైవేట్ వేడుక, కుటుంబం, దగ్గరి బంధువులకు మాత్రమే పరిమితం చేశారు. గౌతమ్ అదానీ తన కుటుంబం సాంప్రదాయ, సరళమైన పద్ధతులను ఇష్టపడుతుందని, అందుకే వివాహం కూడా సరళంగా ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశారు.
అతిథి జాబితాలో ఎవరు ఉన్నారు?
అనంత్ అంబానీ వివాహానికి ప్రపంచ దిగ్గజాలు హాజరయ్యారు. ఈ వివాహం, సంబంధిత వేడుకలకు బిల్ గేట్స్, హిల్లరీ క్లింటన్, మార్క్ జుకర్‌బర్గ్, కిమ్ కర్దాషియాన్, జాన్ సెనా, అడెలె, రిహన్న వంటి ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు. ఇది కాకుండా బాలీవుడ్‌లోని దాదాపు అందరు పెద్ద తారలు ఈ వివాహంలో భాగమయ్యారు. మరోవైపు జీత్ అదానీ వివాహానికి సన్నిహిత కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహం గురించి మీడియా కవరేజ్ చాలా తక్కువగా ఉంది. ఇది పూర్తిగా కుటుంబ కార్యక్రమం.
దాతృత్వం, సామాజిక సహకారాలు
అంబానీ కుటుంబం తమ వివాహాన్ని ఒక గొప్ప వేడుకగా మార్చగా, అదానీ కుటుంబం వివాహ సందర్భంగా సామాజిక సేవకు పెద్ద పీట వేసింది. పెళ్లికి రెండు రోజుల ముందు గౌతమ్ అదానీ ‘మంగళ సేవా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని కింద 500 మంది వికలాంగులైన కొత్తగా పెళ్లైన మహిళలకు ప్రతి సంవత్సరం రూ. 10 లక్షలు అందజేయనున్నారు. ఈ చొరవను జీత్ అదానీ స్వయంగా ప్రారంభించారు. అతను కొత్తగా వివాహం చేసుకున్న 21 మంది వికలాంగ మహిళలను కలుసుకుని వారికి ఆర్థిక సహాయం అందించాడు.
అంతేకాకుండా, జీత్, దివా వివాహం అయిన వెంటనే ప్రతి సంవత్సరం 500 మంది వికలాంగులైన మహిళల వివాహానికి రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. అదే సమయంలో గౌతమ్ అదానీ వివిధ సామాజిక పనుల కోసం రూ. 10,000 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన పనులు ఉంటాయి. అయితే, అంబానీ తన కుమారుడు అనంత్ వివాహ వేడుక సందర్భంగా అనేక రోజుల పాటు వివిధ ప్రదేశాలలో భండారాను కూడా నిర్వహించారు.
ఒక వైపు, అనంత్ అంబానీ వివాహం గ్లామర్, సంపద, ప్రభావవంతమైన వ్యక్తుల సమావేశం అయితే, మరోవైపు, జీత్ అదానీ వివాహం సంస్కృతి, సంప్రదాయం, సామాజిక సేవ సందేశాన్ని ఇచ్చింది. రెండు వివాహాలు వాటి స్వంత మార్గంలో ముఖ్యాంశాలుగా నిలిచాయి. కానీ ఏది ఎక్కువ ఆకట్టుకుందనేది ప్రతి వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Cyber Threat: ఎలాంటి క్లిక్ లేకుండా మొబైల్‌ను ఎలా హ్యాక్ చేస్తారు? జీరో-క్లిక్ హ్యాక్ అంటే ఏమిటి?
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి