Amazon Sale: ఈ-స్కూటర్లపై ఏకంగా 54శాతం డిస్కౌంట్.. రిజిస్ట్రేషన్‌తో పనిలేదు.. లైసెన్స్ అవసరమే రాదు..

|

Oct 06, 2024 | 5:23 PM

ఎలక్ట్రిక్ స్కూటర్లపై అమెజాన్ సేల్లో మునుపెన్నడూ లేని టాప్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని దాదాపు 50శాతం డిస్కౌంట్ తో కొనుగోలు చేయోచ్చు. వాటిల్లో టాప్ మూడు స్కూటర్లు, దానిపై ఆఫర్ల గురించి తెలుసుకుందాం. జాబితాలో గ్రీన్ ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఈఓఎక్స్ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్, కోమకీ ఎక్స్-వన్ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి.

Amazon Sale: ఈ-స్కూటర్లపై ఏకంగా 54శాతం డిస్కౌంట్.. రిజిస్ట్రేషన్‌తో పనిలేదు.. లైసెన్స్ అవసరమే రాదు..
Amazon Deals
Follow us on

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. ఈ సేల్లో అన్ని రంగాలకు చెందిన వస్తువులపై టాప్ డీల్స్ ఉన్నాయి. వాటిల్లో ఆటోమొబైల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై అమెజాన్ సేల్లో మునుపెన్నడూ లేని టాప్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని దాదాపు 50శాతం డిస్కౌంట్ తో కొనుగోలు చేయోచ్చు. వాటిల్లో టాప్ మూడు స్కూటర్లు, దానిపై ఆఫర్ల గురించి తెలుసుకుందాం. జాబితాలో గ్రీన్ ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఈఓఎక్స్ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్, కోమకీ ఎక్స్-వన్ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి.

ఈఓఎక్స్ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్..

ఈ స్కూటర్ అమెజాన్ లో రూ. 1.30లక్షలు(ఎక్స్ షోరూం) ధరకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీనిపై 54శాతం తగ్గింపు లభిస్తోంది. దీని కారణంగా మీరు దీనిని కేవలం రూ. 59,999కి కొనుగోలు చేయొచ్చు. అంతేకాక రూ. 2,938 ఈఎంఐతో కూడా కొనొచ్చు. దీనిలోని బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 80 కిలోమీటర్లరేంజ్ ఇస్తుంది. 250వాట్ల బీఎల్డీసీ మోటార్, 32ఏహెచ్, 60వోల్ట్స్ బ్యాటరీని కలిగి ఉంటుంది. స్కూటర్ గరిష్ట వేగం 25కిలోమీటర్ల ఉంటుంది. డీఆర్ఎల్ ల్యాంప్, అధిక రిజల్యూషన్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. దీనికి ఆర్టీఓ రిజిస్ట్రేషన్ గానీ, డ్రైవింగ్ సైసెన్స్ కూడా అవసరం లేదు.

గ్రీన్ ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్..

ఈ స్కూటర్ ధర అమెజాన్లో రూ. 69,000గా ఉంది. దీనిపై 51శాతం తగ్గింపు ఉంది. అంటే మీరు దీనిని కేవలం రూ. 33,999కే కొనుగోలు చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటే రూ. 1665కే చెల్లించి ఇంటికీ తెచ్చుకోవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 25కిలోమీటర్లు, 10 అంగుళాల చక్రాలు ఉంటాయి. దీనిని 4 నుంచి ఆరు గంటల్లోనే పూర్తిగా చార్జ్ చేయొచ్చు. సింగిల్ చార్జ్ పై 60కిలోమీటర్లు రేంజ్ ఇస్తుంది. దీనికి కూడా ఆర్టీఓ రిజిస్ట్రేషన్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ అవసరం లేదు.

కోమకీ ఎక్స్-వన్ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్..

ఈ స్కూటర్ ధర రూ. 49,999గా ఉంది. ప్రస్తుతం అమెజాన్లో దీనిపై 24శాతం తగ్గింపు ఉంది. దీంతో రూ. 37,799కే స్కూటర్ ను ఇంటికి తెచ్చుకోవచ్చు. దీనిలోని బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 25కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గరిష్టంగా గంటకు 25కిలోమీటర్ల వేగంత ప్రయాణిస్తుంది. దీనిలో బ్యాటరీ 4 నుంచి 5 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ కు కూడా ఆర్టీఓ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..