Elon Musk: ఎలాన్ మస్క్ నిర్ణయంతో లాభపడుతున్న అమెజాన్, మైక్రోసాఫ్ట్.. ఎందుకంటే..

|

Jun 06, 2022 | 6:41 AM

Elon Musk: ఎలాన్ మస్క్ టెస్లా ఉద్యోగులను కార్యాలయానికి తిరిగి రావాలని లేదా జాబ్ మానేయాలని ఆదేశించిన తర్వాత.. ప్రధాన టెక్ కంపెనీల్లోని రిక్రూటర్లు ప్రతిభ కలిగిన వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Elon Musk: ఎలాన్ మస్క్ నిర్ణయంతో లాభపడుతున్న అమెజాన్, మైక్రోసాఫ్ట్.. ఎందుకంటే..
Elon Musk
Follow us on

Elon Musk: ఎలాన్ మస్క్ టెస్లా ఉద్యోగులను కార్యాలయానికి తిరిగి రావాలని లేదా జాబ్ మానేయాలని ఆదేశించిన తర్వాత.. ప్రధాన టెక్ కంపెనీల్లోని రిక్రూటర్లు ప్రతిభ కలిగిన వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాన్ మస్క్ గత బుధవారం ఈ ప్రకటన చేశారు. పని చేయడానికి కార్యాలయానికి తిరిగి రావాలని తన ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా స్పష్టం చేశారు.

సరిగ్గా ఈ అవకాశాన్ని వాడుకునేందుకు మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాల నుంచి రిక్రూటర్‌లు, అలాగే ఇన్‌సైట్, బెస్టో వంటి చిన్న కంపెనీల నుంచి అసంతృప్తి చెందిన టెస్లా ఉద్యోగులను ఆకర్షించేందుకు నెట్‌వర్క్‌ చేరుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో గురువారం నాడు.. Amazon వెబ్ సర్వీసెస్‌కు చెందిన జాఫర్ చౌదరి టెస్లాలో అసంతృప్తిగా ఉన్న ఎవరైనా ఉద్యోగి Amazonలో పని చేయడానికి దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తూ లింక్డ్‌ఇన్ పోస్ట్ చేశారు.”మార్స్ చక్రవర్తి మిమ్మల్ని కోరుకోకపోతే #AWSకి తీసుకురావడానికి నేను సంతోషిస్తాను” అని చౌదరి రాశారు.

10 సంవత్సరాల్లోపు మనిషిని అంగారక గ్రహంపైకి పంపుతానని 2011లో మస్క్ చేసిన వాగ్దానం గురించి చౌదరి గుర్తుచేశారు. మస్క్ విమర్శకులు చాలా కాలంగా తన ఉద్యోగుల పట్ల అతని పేలవమైన ప్రవర్తనను ఎత్తిచూపుతున్నారు. అనేక ఇతర టెక్ కంపెనీల మాదిరిగానే, అమెజాన్ ఉద్యోగులు కూడా కరోనా అనంతర పాలసీ సర్దుబాటు కారణంగా నిరవధికంగా ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించబడ్డారు. కొత్త లేబర్ ల్యాండ్‌స్కేప్‌కు అనుగుణంగా టెస్లా ఇష్టపడకపోవటంతో, మస్క్ తప్పు చేస్తున్నాడని చాలామంది భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.