Postpaid Plans: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎక్కువైపోయింది. డేటా కూడా ఎక్కువగా ఉపయోగించేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ప్రీపెయిడ్ ప్లాన్స్‌నే కాకుండా పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌ను అందిస్తున్నాయి ఆయా టెలికం కంపెనీలు. రోజు డేటా ఎక్కువగా ఉపయోగించేవారికి మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక తాజాగా టెలికం కంపెనీలు రిలయన్స్ జియో (Jio), ఎయిర్‌టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) తమ తమ యూజర్లకు వివిధ రకాల పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. ప్లాన్ ధరలు ఒకేటా ఉన్నా.. బెనిఫిట్స్ మాత్రం వేరేవేరుగా ఉన్నాయి. ఇంటర్నెట్ ఎక్కువగా వాడేవారికి మంచి బెనిఫిట్ అనే చెప్పాలి. పోస్టు కొత్తగా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు తీసుకోవాలనుకునే వారు తప్పకుండా వీటి గురించి తెలుసుకోండి.
రిలయన్స్ జియో పోస్ట్‌పోయిడ్ ప్లాన్ ధర రూ.399:
ఈ ప్లాన్ ద్వారా నెలవారీ మొత్తంలో 75GB డేటా పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100SMSలు లభిస్తాయి. వీటితో పాటు OTT ప్లాట్‌ఫామ్‌లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. అలాగే జియో టీవీతో పాటు జియో యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు కేటాయించిన నెలవారీ డేటా మొత్తం అయిపోతే ఒక్క జీబీకీ రూ.10 చార్జ్ పడుతుంది. నెలవారీలో డేటా మిగిలిపోతే వచ్చే నెలలో కూడా ఉపయోగించుకోవచ్చు.
ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ధర రూ.399:
ఈ ప్లాన్‌తో నెల మొత్తానికి 40GB డేటా వస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100SMSలు. అయితే 40GB డేటా అయిపోతే ఆ తర్వాత ఒక్కో MBకి 2 పైసల చొప్పున చార్జ్ పడుతుంది. ఇందులో ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎయిర్‌టెల్ ఎక్స్ ట్రీమ్ యాప్ ప్రీమియమ్, ఉచితంగా వింగ్ మ్యూజిక్‌ను ఉపయోగించుకోవచ్చు. ఒక వేళ నెలవారీ డేటాలో మిగిలిపోయినట్లయితే వచ్చే నెలలో కూడా వాడుకోవచ్చు.
వొడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ధర రూ.399:
ఈ ప్లాన్‌లో మొత్తం నెలకు 40GB డేటా లభిస్తుంది. అన్‌మిలిటెడ్ కాల్స్, రోజుకు 100SMSలు వాడుకోవచ్చు. వీ మూవీస్ యాప్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ వీ యాప్‌లో ఆరు నెలల పాటు ఎలాంటి యాడ్స్ లేకుండా మ్యూజిక్ వాడుకోవచ్చు. ఇందులో 5GB వరకు ప్రీమియం సినిమాలు, ఇతర షోలు చూసే అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: