PM Svanidhi: ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ. లక్ష రుణం! ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!

ఎలాంటి గ్యారెంటీ లేదా సెక్యూరిటీ లేకుండా లోన్ లభించడం చాలా కష్టం. అయితే చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ స్కీమ్ ద్వారా సుమారు రూ. లక్ష వరకూ లోన్ పొందొచ్చు. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

PM Svanidhi: ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ. లక్ష రుణం! ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
Pm Svanidhi

Updated on: Oct 05, 2025 | 4:52 PM

చిన్న వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి యోజన అనే స్కీమ్ అమలు చేస్తోంది. ఈ స్కీమ్ లో భాగంగా ఎలాంటి హామీ లేకుండా రూ. 90 వేల వరకూ రుణం తీసుకునే సౌకర్యం ఉంది. చిన్న వ్యాపారులకు, వీధి వ్యాపారులకు చేయూతనివ్వడం కోసం ప్రభుత్వం ఈ పథకం అందుబాటులోకి తెచ్చింది.

మూడు దశల్లో

దిగువ తరగతి వ్యాపారులు, తాకట్ట పెట్టడానికి తమ వద్ద ఏమీ లేని వ్యాపారుల కోసం పీఎం స్వనిధి యోజన స్కీమ్ అండగా నిలుస్తుంది. ఈ స్కీమ్ 2020లోనే మొదలైంది. అప్పట్లో రూ. 80 వేల వరకూ లోన్ మంజూరు చేసేవాళ్లు. ఇప్పుడు అదనంగా రూ.10 వేలు పెంచి రూ. 90 వేలు ఇస్తున్నారు.  అంటే ఇప్పుడు మీరు ఈ స్కీమ్ ద్వారా 90 వేల రూపాయల వరకు ఎలాంటి హామీ పత్రాలు లేకుండా రుణం తీసుకోవచ్చు. అయితే ఈ లోన్ మొత్తం మూడు దశల్లో శాంక్షన్ అవుతుంది. మొదటి దశలో 15 వేల రూపాయలు, రెండవ దశలో 25 వేల రూపాయలు, మూడవ దశలో 50 వేల రూపాయలు ఇస్తారు.

ప్రాసెస్ ఇలా..

ఇప్పటివరకూ సుమారు 68 లక్షల మందిఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. మీరు కూడా ప్రయోజనం పొందాలనుకుంటే ముందుగా మీరు మున్సిపల్ కార్పొరేషన్ లేదా స్థానిక ప్రభుత్వ సంస్థలో అప్లికేషన్ పెట్టుకోవాలి. లేదా ఏదైనా బ్యాంకుకు వెళ్లి అవసరమైన పత్రాలను సమర్పించి కూడా లోన్ కు అప్లై చేసుకోవచ్చు. లేదా ఆన్ లైన్ లో కూడా ప్లై చేసుకోవచ్చు. పీఎం స్వనిధి వెబ్ సైట్(www.pmsvanidhi.mohua.gov.in)లోకి వెళ్లి అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. అప్లికేషన్ లాగిన్ డీటెయిల్స్ తో లోన్ అప్లై చేసుకోవచ్చు. ఏదైనా నెట్ సెంటర్ లేదా మీ సేవ కేంద్రాలకు వెళ్తే ఈజీగా ప్రాసెస్ పూర్తి చేస్తారు. మీ దగ్గర తగిన పత్రాలు రెడీగా ఉంచుకోవాలి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇ‍క్కడ క్లిక్‌ చేయండి