UPI Payments: యూపీఐ ఖాతాదారులకు అలెర్ట్‌.. కొత్తగా మారిన ఐదు నియమాలతో లాభాలెన్నో..!

| Edited By: Ram Naramaneni

Jan 25, 2024 | 7:33 PM

కొత్త ఏడాది యూపీఐ  వినియోగదారుల కోసం మెరుగైన సౌలభ్యం, ఆర్థిక సమ్మేళనం, సురక్షిత లావాదేవీలను అందిస్తుంది . 2024లో యూపీఐ 2023 లావాదేవీల కంటే ఎక్కువ వాల్యూమ్ పరంగా 60 శాతం వృద్ధిని కొనసాగిస్తుంది. అలాగే పీ2ఎం, పీ2పీ లావాదేవీల కంటే ఎక్కువ ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. పీ2ఎం మొత్తం యూపీఐ వాల్యూమ్‌లో దాదాపు 60 శాతం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో 2024లో యూపీఐ కొన్ని నియమాలను మార్చింది.

UPI Payments: యూపీఐ ఖాతాదారులకు అలెర్ట్‌.. కొత్తగా మారిన ఐదు నియమాలతో లాభాలెన్నో..!
Upi Payments
Follow us on

భారతదేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ విషయంలో ప్రపంచ దేశాలతో పోటీపడుతుంది. 2016 ముందు వరకూ ఎక్కువగా నగదు చెల్లింపులు ఎక్కువగా ఉండేవి. అయితే 2016 నవంబర్‌లో చేసిన నోట్ల రద్దు తర్వాత నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తీసుకొచ్చిన యూపీఐ సేవలు విప్లవాన్ని సృష్టించాయి. అయితే కొత్త ఏడాది యూపీఐ  వినియోగదారుల కోసం మెరుగైన సౌలభ్యం, ఆర్థిక సమ్మేళనం, సురక్షిత లావాదేవీలను అందిస్తుంది . 2024లో యూపీఐ 2023 లావాదేవీల కంటే ఎక్కువ వాల్యూమ్ పరంగా 60 శాతం వృద్ధిని కొనసాగిస్తుంది. అలాగే పీ2ఎం, పీ2పీ లావాదేవీల కంటే ఎక్కువ ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. పీ2ఎం మొత్తం యూపీఐ వాల్యూమ్‌లో దాదాపు 60 శాతం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో 2024లో యూపీఐ కొన్ని నియమాలను మార్చింది. ముఖ్యంగా వినియోగదారులకు మేలు చేసేలా ఉన్న ఆ నియమాలు ఏంటో? ఓసారి తెలుసుకుందాం.

యూపీఐ లిమిట్‌ పెంపు

ఆసుపత్రులు, విద్య సంబంధిత చెల్లింపుల లావాదేవీల పరిమితి రూ.5 లక్షలకు పెంచారు. క్లిష్టమైన రంగాలకు అధిక విలువ చెల్లింపులు సులభతరం చేయడం ద్వారా వినియోగదారులకు అధిక మేలును చేకూరుస్తాయి. యూపీఐ యుటిలిటీని మరింత మెరుగుపరచడానికి సెంట్రల్ బ్యాంక్ యూపీఐ చెల్లింపుల కోసం లావాదేవీల పరిమితిని రూ.1 లక్ష నుంచి ₹ 5 లక్షలకు పెంచింది

క్రెడిట్ లైన్

యూపీఐపై ముందుగా మంజూరు చేసిన క్రెడిట్ లైన్ వ్యక్తులు, వ్యాపారాలకు రుణాల లభ్యతను తెస్తుంది. వ్యాపారులకు వారి అవసరాలను తీర్చుకోవడానికి వెంటనే రుణం పొందడం సులభం అవుతుంది. పైగా తక్కువ వడ్డీకే రుణాలను పొందవచ్చు.

సెకండరీ మార్కెట్ 

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం దాని బీటా దశలో ఉన్న యూపీఐ ఫర్ సెకండరీ మార్కెట్‌ను ప్రవేశపెట్టింది. పరిమిత పైలట్ కస్టమర్‌లు క్లియరింగ్ కార్పొరేషన్‌ల ద్వారా టీ1 ప్రాతిపదికన నిధులను పోస్ట్ ట్రేడ్ కన్ఫర్మేషన్‌ను బ్లాక్ చేయడానికి, చెల్లింపులను సెటిల్ చేయడానికి అనుమతిస్తుంది.

క్యూఆర్‌ కోడ్‌తో ఏటీఎం

ప్రస్తుతం పైలెట్‌ దశలో ఉన్న క్యూఆర్‌ కోడ్‌లను ఉపయోగించే ఏటీఎంలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఫిజికల్ డెబిట్ కార్డ్‌ల అవసరాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా నగదు ఉపసంహరణలను శక్తివంతం చేయడంతో పాటు మెరుగైన సౌలభ్యం, ఆర్థిక చేరికను అందిస్తాయి. 

కూలింగ్‌ పిరియడ్‌ 

భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ. 2,000 కంటే ఎక్కువ మొదటి చెల్లింపులను ప్రారంభించే వినియోగదారుల కోసం నాలుగు గంటల కూలింగ్‌ పీరియడ్‌ను ప్రతిపాదించింది, ఈ నిర్ణీత గడువులోపు లావాదేవీలను రివర్స్ చేయడానికి లేదా సవరించడానికి వినియోగదారులను అనుమతించడం ద్వారా యూపీఐ లావాదేవీల భద్రతను మెరుగుపరుస్తుంది.