ఉద్యోగుల భవిష్య నిధిని అంటే పీఎఫ్‌గా పిలిచే ఖాతా ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలతోపాటు ఆర్థిక భరోసాను కల్పిస్తుంది. ఈ ఖాతా ఉద్యోగుల కోసం తప్పనిసరి పొదుపు, పదవీ విరమణ ప్రణాళికగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత ఈ ఫండ్ కార్పస్ వారికి అందుబాటులో ఉంటుంది. ఈపీఎఫ్ సభ్యులు తమ ఉపసంహరణ లేదా బదిలీ క్లెయిమ్‌లను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో సమర్పించవచ్చు. వ్యక్తులు తమ దరఖాస్తును ఎలా సమర్పించినా ఆన్లైన్లో వారి ఈపీఎఫ్ క్లెయిమ్‌ల పురోగతిని తనిఖీ చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు ఫారం 19ని ఉపయోగించి పీఎఫ్ క్లెయిమ్‌ను ఫైల్ చేయవచ్చు. ఈ ఫామ ద్వారా పూర్తిగా లేదా పాక్షికంగా పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే సభ్యులు నేరుగా సభ్యుల ఇంటర్ఫేస్ నుంచి పీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ (ఫారమ్19), పెన్షన్ ఉపసంహరణ ప్రయోజనం (ఫారం10-సీ), పీఎఫ్ పార్ట్ విత్‌డ్రావల్ (ఫారమ్31) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు . సాధారణంగా పీఎఫ్‌ను క్లెయిమ్ చేస్తే దాన్ని పరిష్కరించడానికి సంబంధిత ఈపీఎఫ్ఓ ఆఫీస్‌కు దాదాపు 20 రోజులు పడుతుంది. ఈ సమయంలోపు క్లెయిమ్ సెటిల్కాకపోతే ఖాతాదారులు ఏం చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.
ఇరవై రోజుల్లో పీఎఫ్ క్లెయిమ్కాకపోతే ఖాతాదారుని గ్రీవెన్స్‌కు బాధ్యత వహించే ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్‌ను సంప్రదించాలి. అలాగే ఉద్యోగుల కోసం విభాగంలోని ఈపీఎఫ్‌ఐజీఎంస్ ఫీచర్‌ని ఉపయోగించి వెబ్సైట్లో ఫిర్యాదును ఫైల్ చేయవచ్చు.
సభ్యులు సర్వీసులో చేరిన తేదీ నుంచి నిష్క్రమించిన తేదీ ఈపీఎఫ్ఓ డేటాబేస్‌లో అందుబాటులో ఉండాలి. అలాగే సభ్యుడు ప్రస్తుతం పీఎఫ్ చట్టం కింద కవర్ చేయదగిన ఏ స్థాపన కింద పని చేయకూడదు. దీంతో పాటు క్లెయిమ్‌ను ఎస్టాబ్లిష్మెంట్ నుంచి నిష్క్రమించిన తర్వాత రెండు నెలల ముందు సమర్పించకూడదు. అలాగే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సభ్యులు తమ ఈ-కెవైసీ (ఆధార్) ఆధారాలను ఈపీఎఫ్ఓకు పంచుకోవడానికి యుఐడీఏఐకి సమ్మతిని ఇస్తూ వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా క్లెయిమ్ సమర్పణను ప్రామాణీకరించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి