Airtel Recharge Plan: ఎయిర్‌టెల్‌ రూ.349 ప్లాన్‌తో అదనపు ప్రయోజనాలు.. పోటీగా జియో, వీ రీఛార్జ్‌ ప్లాన్స్‌..!

Airtel Recharge Plan: ప్రస్తుతం టెలికం రంగలో పోటీ నెలకొంది. వివిధ టెలికం నెట్‌వర్క్‌లు కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వివిధ రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి...

Airtel Recharge Plan: ఎయిర్‌టెల్‌ రూ.349 ప్లాన్‌తో అదనపు ప్రయోజనాలు.. పోటీగా జియో, వీ రీఛార్జ్‌ ప్లాన్స్‌..!

Updated on: Nov 15, 2021 | 5:27 PM

Airtel Recharge Plan: ప్రస్తుతం టెలికం రంగలో పోటీ నెలకొంది. వివిధ టెలికం నెట్‌వర్క్‌లు కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వివిధ రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక ఎయిర్‌టెల్‌ రూ.349 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌ ద్వారా రోజు 2.5 డేటా, అపరిమిత కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. అయితే అదనపు ఖర్చు లేకుండా మూడు నెలల పాటు వింగ్‌ మ్యూజిక్‌, అమెజాన్‌ ప్రైమ్‌ మొబైల్‌ సబ్‌స్ర్కిప్షన్‌ను పొందవచ్చు. అయితే ఈ ప్లాన్‌ 28 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఇక రిలయన్స్‌ జియో కూడా ఇదే రేంజ్‌లోఆఫర్లను తీసుకొచ్చింది.

రిలయన్స్‌ జియో ఇదే రూ.349 ప్లాన్‌తో రోజు3 జీబీ డేటా అందిస్తోంది. రోజు అపరిమిత కాల్స్‌, 28 రోజుల వ్యాలిడిటీ, రోజు 100 ఎస్‌ఎంఎస్‌లతో అందిస్తోంది. ఈ ప్లాన్‌తో ఎలాంటి ఓటీటీ సబ్‌స్ర్కిప్షన్‌ను పొందలేరు. అలాగే జియో రూ.499 ప్లాన్‌ను కూడా అందిస్తోంది. రోజు 3జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్‌ ఉంటాయి. ఈప్లాన్‌తో డిస్నీ+హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఇంకా అదనంగా 6జీబీ డేటాను కూడా అందిస్తోంది. రూ.349 జియో ప్లాన్‌కు సమానంగా ప్రయోజనాలు ఉన్నాయి.

అదే విధంగా వొడాఫోన్‌ ఐడియా ప్లాన్స్‌ పరిశీలిస్తే.. రూ.301 ప్లాన్‌ అందుబాటులో ఉంది. ఇందులో ఆరోగ్య బీమా ప్రయోజనాలు కూడా అందిస్తోంది. ఇందులో డైలీ 1.5జీబీ డేటా, అపరిమిత కాల్స్‌, అదనంగా 2జీబీ డేటా, రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు, 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. ఇందులో రూ.501 ప్లాన్‌ కూడా అందుబాటులో ఉంది. రోజు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్‌, డిస్నీ+హాట్‌స్టార్‌ మొబైల్‌ ఎడిషన్‌కు ఒక సంవత్సరం పాటు యాక్సెస్‌, అదనపు ఖర్చు లేకుండా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్‌ డేటా కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌ 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.

ఇవి కూడా చదవండి:

PF UAN Number: మీరు ఈపీఎఫ్‌ఓ యూఏఎన్‌ నంబర్‌ మర్చిపోయారా..? ఇలా చేయండి..!

Indian Railways: రైల్వే ప్రయాణికులు అలర్ట్‌.. ఆ సమయాల్లో నిలిచిపోనున్న రిజర్వేషన్‌ సేవలు