
ఎయిర్‌టెల్ తన యూజర్ల కోసం కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లతో పాటు అపరిమిత 4G డేటాతో కూడిన ప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్లాన్‌లు ఒకటే, కానీ డేటా ప్రయోజనాలను అన్‌లిమిటెడ్ చేసింది. ఈ అపరిమిత డేటా ప్రయోజనం 4G, 5G యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ ప్రయోజనాలు ఎయిర్‌టెల్ రూ. 399, రూ. 449 రీఛార్జ్ ప్లాన్‌లలో అందుబాటులో ఉన్నాయి. రెండు ప్లాన్‌లు భారతదేశం అంతటా అందుబాటులో ఉన్నాయి.
టెలికామ్‌టాక్ నివేదిక ప్రకారం భారతీ ఎయిర్‌టెల్ రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, అపరిమిత 4G, 5G డేటాను అందిస్తుంది. 30 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు 300 GBతో సహా అపరిమిత 4G, 5G డేటాను అందిస్తున్నారు.
భారతీ ఎయిర్‌టెల్ రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల సర్వీస్ వాలిడిటీని కలిగి ఉంది. అయితే, కొత్త ప్లాన్‌తో, వినియోగదారులు 300 GB చెల్లుబాటుతో 30 రోజుల పాటు అపరిమిత 4G, 5G డేటాను పొందుతున్నారు. వారు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను కూడా పొందుతున్నారు. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌లో ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా అనేక అదనపు ప్రయోజనాలను కూడా చేర్చింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి