
Airtel Plan: దీపావళికి కొద్ది రోజుల ముందు భారతి ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు ఒక పెద్ద శుభవార్తను అందించింది. 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1 జీబీ డేటాతో కూడిన 299 రూపాయల రీఛార్జ్‌ను కంపెనీ తిరిగి ప్రవేశపెట్టింది. దీని గురించి కంపెనీ ఎలాంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు. ఎయిర్‌టెల్ యాప్, వెబ్‌సైట్‌లో ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్‌ను గమనించవచ్చు. కంపెనీ ఎలాంటి పెంపు లేకుండానే పాత ధరతోనే అంటే 299 రూపాయల ప్లాన్‌ను తిరిగి ప్రారంభించింది.
ఖరీదైన రీఛార్జ్‌లు తీసుకోవలసి వస్తున్న వినియోగదారులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆగస్టులో ఈ ప్లాన్‌ను తొలగించడంతో వినియోగదారులు నిరాశ చెందారు. ఎయిర్‌టెల్ ఈ ఏడాది ఆగస్టులో రూ. 299 రీఛార్జ్‌ను నిలిపివేసింది. దీంతో పాటు, రూ. 579, రూ. 619, రూ. 649 ప్రీపెయిడ్ రీఛార్జ్‌లను కూడా తొలగించారు.
ఎయిర్‌టెల్ తన రూ. 299 ప్రీపెయిడ్ రీఛార్జ్‌పై ఎలాంటి ప్రయోజనాలను తగ్గించలేదు. వినియోగదారులు మునుపటిలాగే 28 రోజుల వ్యాలిడిటీతో పాటు అపరిమిత కాల్స్ చేసుకోవడం, రోజుకు 100 SMS సందేశాలు పంపడం, రోజువారీ 1GB డేటాను పొందడం ఉన్నాయి.
ఎయిర్‌టెల్ రూ. 299 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం కూడా తిరిగి వచ్చింది. ఈ కంపెనీ తన కస్టమర్లకు 12 నెలల పాటు రూ. 4,000 విలువైన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియంను ఉచితంగా అందిస్తోంది. ఇందులో స్పామ్ కాల్స్ కోసం రియల్-టైమ్ అలర్ట్‌లను అందించే ఎయిర్‌టెల్ సేఫ్‌కు యాక్సెస్ కూడా ఉంటుంది. కస్టమర్లు ఉచితంగా హలోట్యూన్స్‌ను కూడా ఆస్వాదిస్తారు.
ఇది కూడా చదవండి: Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్‌లో ఒరిజినల్ వస్తువులు గుర్తించడం ఎలా? ఈ ట్రిక్స్ తెలుసుకోండి!
ఇది కూడా చదవండి: Tankless Geyser: ట్యాంక్‌లెస్ గీజర్ అంటే ఏమిటి? నీటిని స్టోర్ చేయకుండానే వేడి చేస్తుంది.. కరెంట్ ఆదా కూడా!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి