Airtel Xstream Premium: ఎయిర్‌టెల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.149కే 15 ఓటీటీ వీడియో స్ట్రీమింగ్‌ సేవలు

|

Feb 11, 2022 | 8:13 AM

Airtel Xstream Premium: ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌ దూసుకుపోతోంది. వీడియో స్ట్రీమింగ్‌ సర్వీసులపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇక 15..

Airtel Xstream Premium: ఎయిర్‌టెల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.149కే 15 ఓటీటీ వీడియో స్ట్రీమింగ్‌ సేవలు
Follow us on

Airtel Xstream Premium: ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌ దూసుకుపోతోంది. వీడియో స్ట్రీమింగ్‌ సర్వీసులపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇక 15 వీడియో యాప్స్‌ (APPs) కు సంబంధించిన సేవలు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ (Airtel Xstream Premium) ద్వారా ఉచితంగా సేవలు అందిస్తుండగా, ఇప్పుడు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం సేవలకు నెలవారీగా రూ.149గా నిర్ణయించింది. ఇక వార్షిక సభ్యత్వం రూ.1,499గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక వేళ వార్షిక ప్యాకేజీ తీసుకున్నట్లయితే ఈ సేవలు నెలకు కేవలం రూ.125లకే పొందవచ్చు. దేశ, విదేశాలకు చెందిన 15 ఓటీటీ (OTT)ల కంటెంట్‌ను ఒకే యాప్‌లో అందించేందుకు సేవలను ప్రారంభించామని తెలిపింది.

ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం ద్వారా 10,500 మూవీస్‌, షోలు, లైవ్‌ చానెళ్లు

కాగా, ఈ ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం ద్వారా 10,500 సినిమాలు, ప్రోగ్రామ్‌లు, లైవ్‌ చానెళ్లను వినియోగదారులు చూడవచ్చని ఎయిర్‌టెల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందులో రకరకాల స్ట్రీమింగ్‌ సేవలు పొందవచ్చని తెలిపింది. అయితే 20 మిలియన్ల పెయిడ్‌ సబ్‌స్క్రైబర్లను లక్ష్యంగా పెట్టుకున్నామని ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ సీఈవో ఆదర్శ్‌ నాయర్‌ పేర్కొన్నారు. ఈ ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం సేవలో.. SonyLIV, ErosNow, Lionsgate Play, Hoichoi, ManoramaMax, Shemaroo, Ultra, HungamaPlay, EPICon, Docubay, DivoTV, Klikk, Nammaflix, Dollywood, Shorts TV వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు కస్టమర్‌లు యాక్సెస్ పొందుతారని తెలిపింది. మొబైల్‌, టాబ్లెట్‌, ల్యాప్‌టాప్‌లను ఉపయోగించి కూడా యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా ఈ సేవలు పొందవచ్చని తెలిపింది. అలాగే ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ సెటాప్‌ బాక్స్‌ ద్వారా టీవీల్లో కూడా చూడవచ్చని తెలిపింది. అయితే ప్రస్తుతం ఈ సేవలు ఎయిర్‌టెల్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

Tesla Recalls: వాహనదారుల మెడకు చుట్టుకుంటున్న టెక్నికల్‌ ఎర్రర్‌.. వేలాది వాహనాలు వెనక్కి

Redmi Note 11: రెడ్‌మీ నుంచి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్స్‌.. ఫీచర్స్‌, ధర వివరాలు..!