AC Capacity: ఏసీ సామర్థ్యాన్ని టన్నులలో ఎందుకు కొలుస్తారు? దాని వెనుక ఉన్న అసలు కథ ఇదే..!

AC Capacity: ఏసీని కొనుగోలు చేసేటప్పుడు గదికి సరైన కూలింగ్‌ సామర్థ్యాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. పెద్ద గదిలో తక్కువ సామర్థ్యం గల ఏసీని అమర్చడం వల్ల తగినంత కూలింగ్‌ లభించకపోవచ్చు. గదిలోని తేమ గణనీయంగా తగ్గదు. ఏసీ నిరంతరం నడుస్తూనే ఉంటుంది. నిరంతరాయంగా..

AC Capacity: ఏసీ సామర్థ్యాన్ని టన్నులలో ఎందుకు కొలుస్తారు? దాని వెనుక ఉన్న అసలు కథ ఇదే..!
Ac Capacity

Updated on: Jul 15, 2026 | 7:32 PM

AC Capacity: ఎయిర్ కండిషనర్లు (ఏసీలు) వేసవి కాలంలో ఉపశమనాన్ని అందిస్తాయి. కొత్త ఏసీ కొనేటప్పుడు మీరు 1 టన్ను, 1.5 టన్నులు, లేదా 2 టన్నులు వంటి పదాలను విని ఉంటారు. ఏసీ సామర్థ్యాన్ని టన్నులలో ఎందుకు కొలుస్తారు? 1.5 టన్నుల ఏసీ నిజంగా 1.5 టన్నుల బరువు ఉంటుందా? లేదా దీనికి ఇంకేమైనా అర్థం ఉంటుంది. ఏసీలోని టన్ను అనేది దాని బరువుకు సంబంధించింది కాదు. దాని కూలింగ్‌ సామర్థ్యానికి సంబంధించింది. దీని వెనుక ఐస్‌ గడ్డలకు సంబంధించిన 100 సంవత్సరాల కంటే పాత కథ ఉంది.

టన్నుల కొద్దీ ఏసీల కనెక్షన్ ఐస్‌తో ముడిపడి ఉంది

ఎయిర్ కండిషనర్లలో రిఫ్రిజెరెంట్ల వాడకం సర్వసాధారణం కాకముందు, పెద్ద గదులు, భవనాలను చల్లబరచడానికి పెద్ద మంచు (ఐస్‌) దిమ్మలను ఉపయోగించేవారు. 1800ల చివరలో, 1900ల ప్రారంభంలో పెద్ద కూలింగ్‌ వ్యవస్థలలో మంచును వాడేవారు. ఈ మంచు దిమ్మలు సాధారణంగా సుమారు 1 టన్ను, లేదా 2,000 పౌండ్ల బరువు ఉండేవి. దీనివల్ల కూలింగ్‌ వ్యవస్థల సామర్థ్యాన్ని వివరించడానికి టన్నులను ఉపయోగించడం మొదలైంది.

ఇది కూడా చదవండి: DMart: మరో కొత్త వ్యాపారంలోకి డీమార్ట్‌ సైలెంట్‌గా ఎంట్రీ.. భారీ డిస్కౌంట్‌ ఇచ్చే విధంగా ప్లాన్‌..!

ఇవి కూడా చదవండి

తరువాత 24 గంటల్లో ఒక టన్ను మంచును కరిగించడానికి అవసరమైన ఉష్ణ పరిమాణాన్ని సూచించడానికి “టన్ను” అనే పదం వాడుకలోకి వచ్చింది. కాలక్రమేణా ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలలో రిఫ్రిజెరెంట్లను ఉపయోగించడం ప్రారంభమైనప్పటికీ, కూలింగ్‌ సామర్థ్యాన్ని కొలవడానికి “టన్ను” అనే పదాన్ని ఉపయోగించడం కొనసాగిందని చెబుతుంటారు.

టన్ ఏసీ అంటే ఏమిటి?

  • ఏసీలోని టన్ను అనేది దాని ఉష్ణ తొలగింపు సామర్థ్యాన్ని సూచిస్తుంది. సులభంగా చెప్పాలంటే ఒక గది లేదా ప్రదేశం నుండి వేడిని ఎంత వేగంగా తొలగించగలదో దాని ద్వారా ఏసీ కూలింగ్‌ సామర్థ్యం నిర్ణయిస్తారు.
  • ఒక టన్ను కూలింగ్‌ సామర్థ్యం గంటకు 12,000 BTUలకు సమానం. దీని అర్థం ఒక టన్ను ఏసీ గంటకు 12,000 BTUల వేడిని తొలగించగలదు.
  • అదేవిధంగా 5-టన్ల ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ గంటకు 60,000 BTUల కూలింగ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 60,000 BTUలు అని చెప్పడం కంటే 5-టన్ల AC అని చెప్పడం సులభం.

BTU అంటే ఏమిటి?

BTU అంటే బ్రిటిష్ థర్మల్ యూనిట్. దీనిని ఉష్ణ పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా ఒక పౌండు నీటి ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ ఫారెన్‌హీట్ పెంచడానికి అవసరమైన ఉష్ణ పరిమాణాన్ని ఒక BTU సూచిస్తుంది. ఎయిర్ కండిషనర్ల విషయంలో ఒక ఏసీ ఒక గంటలో గది నుండి ఎంత వేడిని తొలగించగలదో BTU రేటింగ్ సూచిస్తుంది. చిన్న స్థాయిలో ఏసీ కూలింగ్‌ సామర్థ్యాన్ని వివరించడానికి BTUలను ఉపయోగిస్తారు. అయితే, పెద్ద ప్రదేశాలు లేదా మొత్తం ఇంటి కూలింగ్‌ వ్యవస్థల సామర్థ్యాన్ని వివరించడానికి టన్నులు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి.

సరైన సామర్థ్యం ఉన్న ఏసీని ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?

ఏసీని కొనుగోలు చేసేటప్పుడు గదికి సరైన కూలింగ్‌ సామర్థ్యాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. పెద్ద గదిలో తక్కువ సామర్థ్యం గల ఏసీని అమర్చడం వల్ల తగినంత కూలింగ్‌ లభించకపోవచ్చు. గదిలోని తేమ గణనీయంగా తగ్గదు. ఏసీ నిరంతరం నడుస్తూనే ఉంటుంది. నిరంతరాయంగా వాడటం వల్ల ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌పై అధిక ఒత్తిడి పడి, అది త్వరగా పాడైపోవడమే కాకుండా, విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది.

మరోవైపు చిన్న గదిలో అధిక సామర్థ్యం గల ఏసీని అమర్చడం కూడా మంచిది కాదు. అధిక సామర్థ్యం గల ఏసీలు తరచుగా ఆన్, ఆఫ్ అవ్వడానికి కారణమవుతాయి. దీనిని షార్ట్-సైక్లింగ్ అని అంటారు. ఇది ఏసీ జీవితకాలాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, గదిలోని తేమను సరిగ్గా తగ్గించకుండా కూడా నిరోధిస్తుంది.

ఇది కూడా చదవండి: Cleaning Tips: మీ ఇంటి స్విచ్‌బోర్డులు పసుపు రంగులోకి మారాయా? ఇలా చేస్తే కొత్త వాటిలా మెరుసిపోతాయ్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us