Petrol Price: తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మూడునాళ్ల ముచ్చటేనా.? త్వరలోనే పెట్రోల్‌ బాంబ్‌ పేలనుందా.?

Petrol Price: ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ఇటీవల కాస్త బ్రేక్‌లు పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం భారీగా పన్నులు తగ్గించడంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చాలా రోజుల తర్వాత లీటర్‌ పెట్రోల్‌ ధర...

Petrol Price: తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మూడునాళ్ల ముచ్చటేనా.? త్వరలోనే పెట్రోల్‌ బాంబ్‌ పేలనుందా.?
Follow us

|

Updated on: May 31, 2022 | 9:51 PM

Petrol Price: ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ఇటీవల కాస్త బ్రేక్‌లు పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం భారీగా పన్నులు తగ్గించడంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చాలా రోజుల తర్వాత లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 100లోపు తగ్గింది. దీంతో వాహనదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవదా అంటే, అంతర్జాతీయ పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. మళ్లీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దీనికి కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా పెరుగుతుండడమే. అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 124 డాలర్లకు చేరింది. ఇక బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర ఏకంగా 125 డాలర్లకు చేరింది. ఇటీవలి కాలంలో క్రూడాయిల్‌ ధర ఈ రేంజ్‌లో పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక క్రూడాయిల్‌ ధరల ఇలా పెరగడానికి రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. రష్యాపై ఆంక్షలను కఠినతరం చేస్తూ, ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే క్రూడాయిల్‌ను మూడొంతుల మేర నియంత్రించడానికి యూరోపియన్ యూనియన్ దేశాలు అంగీకారం తెలిపాయి.

దీంతో ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 124 డాలర్లకు చేరడంతో ఆందోళన నెలకొంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే క్రూడాయిల్‌ ధర మరింత పెరిగే అవకాశం లేకపోలేదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగా దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో