Aadhaar Card: ఆధార్ కార్డులపై బిగ్ అప్డేట్.. త్వరలో పూర్తిగా మారనున్న డిజైన్.. కొత్త కార్డ్ ఎలా ఉంటుందంటే..?

ఆధార్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్. త్వరలో కొత్త ఆధార్ కార్డు రానుంది. ఈ డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది. ఆధార్ కార్డుల్లో ఇటీవల కేంద్రం అనేక మార్పులు తీసుకొస్తుంది. భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోన్న యూఐడీఏఐ.. ఇటీవల కొత్త యాప్ లాంచ్ చేసింది.

Aadhaar Card: ఆధార్ కార్డులపై బిగ్ అప్డేట్.. త్వరలో పూర్తిగా మారనున్న డిజైన్.. కొత్త కార్డ్ ఎలా ఉంటుందంటే..?
Aadhar Card Update

Updated on: Feb 17, 2026 | 7:49 AM

ఆధార్ కార్డుపై బిగ్ అప్డేట్ వచ్చింది. అత్యంత ముఖ్యమైన ఈ గుర్తింపు ధృవీకరణ పత్రం దుర్వినియోగం కాకుండా వినియోగదారులకు మరింత భద్రత కల్పించే దిశగా యూఐడీఏఐ సిద్దమవుతోంది. యూజర్ల డేటా చోరీ కాకుండా అరికట్టేందుకు ఆధార్‌ డిజైన్‌ను పూర్తిగా మార్చేందుకు రంగం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా త్వరలో కొత్త డిజైన్ ఆధార్ కార్డులను జారీ చేయాలని యూఐడీఏఐ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ కార్డులో యూజర్ల వివరాలైన పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, తండ్రి పేరు, క్యూఆర్ కోడ్ లాంటి వివరాలేవీ ఉండవు. పూర్తిగా ఆధార్ కార్డు స్వరూపాన్ని మార్చనున్నారు. ఇటీవల కొత్త ఆధార్ యాప్ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడే ఏకంగా ఫిజికల్ కార్డుకు కొత్త రూపులేఖలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.

ఆధార్ కార్డ్ కొత్త వెర్షన్

ఆధార్ కార్డును త్వరలో యూఐడీఏఐ అప్‌గ్రేడ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఈ కార్డులో కేవలం ఫొటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుంది. మిగతా వివరాలైన అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, పేరు, 12 అంకెల ఆధార్ నెంబర్ లాంటివి ఏవీ ఉండవు. సిమ్ కార్డ్ మోసాలు, అనధికార రుణాలు, ఆధార్ ఎనేబుల్ సిస్టమ్ ఉపసంహరణలు వంటి ఆధార్ సంబంధిత మోసాలను అరికట్టేందుకు యూఐడీఏఐ ఈ మార్పులు తెస్తున్నట్లు చెబుతున్నారు. గత కొంతకాలంగా ఆధార్ సేవల్లో అనేక మార్పులు జరుగుతున్నాయి. భద్రత దృష్ట్యా క్యూఆర్ కోడ్ సిస్టమ్ ద్వారా ఆధార్ వెరిఫికేషన్ చేసుకునే సౌకర్యాన్ని కొత్త యాప్‌లో ప్రవేశపెట్టింది. పేపర్ లెస్ విధానంలో డిజిటల్ ధృవీకరణ ఫీచర్ తీసుకొచ్చింది. అలాగే మీరు ఏ వివరాలు అయితే ఇతరులతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారో వాటిని మాత్రమే సెలక్ట్ చేసుకుని సెండ్ చేయవచ్చు. అలాగే అడ్రస్, మొబైల్ నెంబర్ అప్డేట్ వంటి కొత్త యాప్ ద్వారా సులువుగా చేసుకోవచ్చు.

కొత్త ఆధార్ ఎలా ఉంటుందంటే..?

-కొత్త ఆధార్ కార్డులో ముందువైపు క్యూఆర్ కోడ్ ఉంటుంది
-ఇక కార్డుదారుడి ఫొటో ఫ్రంట్ సైడ్ ఉంటుంది
-ప్రభుత్వ అధికారిక చిహ్నం ముందు భాగంలో ఉంటుంది
-సున్నితమైన సమాచారం దాచబడి ఉంటుంది
-ఫిజికల్ కాపీ నుంచి మోసగాళ్లు వివరాలు సేకరించి మోసాలకు పాల్పడటం తగ్గుతుంది
-క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ ధృవీకరణ కోసం ఇది ఉపయోగపడుతుంది
ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డులు అలాగే ఉండే అవకాశముంది
-ఎవరైనా ఆధార్ కార్డులో మార్పులు చేసుకున్నా లేదా కొత్తగా ఆధార్ తీసుకున్నా ఈ కొత్త డిజైన్‌తో ఆధార్ కార్డు జారీ చేస్తారు
-పాత కార్డులు యథావిధిగా పనిచేస్తాయి

Follow Us