RBI Notes: ఆర్బీఐ రూ.500 నోట్లను రద్దు చేస్తుందా? ఇదిగో క్లారిటీ!

500 Rupee Ban: సాధారణ ప్రజలకు చిన్న నోట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవడమే ఆర్బీఐ ఉద్దేశం. తరచుగా ప్రజలు ATM నుండి రూ. 500 లేదా రూ. 2000 నోట్లను విత్‌డ్రా చేసిన తర్వాత వాటిని చల్లర చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు..

RBI Notes: ఆర్బీఐ రూ.500 నోట్లను రద్దు చేస్తుందా? ఇదిగో క్లారిటీ!

Updated on: May 05, 2025 | 1:24 PM

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్ ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 500 రూపాయల నోటును చెలామణి నుండి తొలగించాలని నిర్ణయించిందని చెబుతున్నారు. రాబోయే కాలంలో 90 శాతం ATMల నుండి 100, 200 రూపాయల నోట్లు మాత్రమే బయటకు వస్తాయని కూడా వైరల్ పోస్ట్ పేర్కొంది.

 

ఆ వైరల్ పోస్ట్ లో ఏముంది?

ఈ వైరల్ పోస్ట్‌లో ఆర్బీఐ బ్యాంకులు తమ ఏటీఎంలలో 100, 200 రూపాయల నోట్ల సంఖ్యను పెంచాలని ఆదేశించిందని చెప్పే స్క్రీన్‌షాట్ ఉంది. ఈ పోస్టులను చూసిన కొందరు రూ.500 నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్లు భావిస్తున్నారు.

 

అసలు ఆర్‌బిఐ సర్క్యూలర్‌ ఏం చెబుతోంది?

అయితే విషయాన్ని పరిశోధించినప్పుడు ఆర్బీఐ బ్యాంకులకు నిజంగానే ఒక ఆదేశం జారీ చేసింది. అయితే, ఈ ఆదేశంలో రూ.500 నోటును నిలిపివేయడం గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. అసలు RBI ఆదేశం ఏమిటంటే బ్యాంకులు తమ ATMలలో రూ.100, రూ.200 నోట్ల లభ్యతను పెంచాలనేది.

ఆర్‌బీఐ ఉద్దేశ్యం ఏమిటి?

సాధారణ ప్రజలకు చిన్న నోట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవడమే ఆర్బీఐ ఉద్దేశం. తరచుగా ప్రజలు ATM నుండి రూ. 500 లేదా రూ. 2000 నోట్లను విత్‌డ్రా చేసిన తర్వాత వాటిని చల్లర చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. చిన్న దుకాణదారులు, సాధారణ ప్రజల వద్ద తరచుగా పెద్ద నోట్లకు బదులుగా చిల్లర ఉండదు. ప్రజలు ఎటువంటి సమస్యను ఎదుర్కోకుండా ఉండటానికి ఏటీఎంల నుండి నేరుగా చిన్న నోట్లను పొందాలనే ఉద్దేశంతో ఆర్బీఐ బ్యాంకులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.

500 రూపాయల నోటును నిలిపివేస్తున్నారా?

రూ.500 నోట్లను ఆర్బీఐ నిలిపివేస్తుందా? అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఆర్బీఐ బ్యాంకులకు జారీ చేసిన ఆదేశాల్లో ఈ 500 నోటును నిలిపివేస్తున్నట్లు ఎటువంటి సూచనను ఇవ్వలేదు. ఈ నోటు మునుపటిలాగే చెలామణిలో ఉంటుంది. వైరల్ పోస్ట్‌లో చెప్పిన విషయాలు పూర్తిగా తప్పు.

అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త పూర్తిగా తప్పు. 500 రూపాయల నోటును నిషేధించాలని ఆర్‌బిఐ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఏటీఎంలలో 100, 200 రూపాయల నోట్ల సంఖ్యను పెంచాలని మాత్రమే బ్యాంకులకు సూచించింది. తద్వారా చిన్న నోట్లు సాధారణ ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి