బంగారం ధరలు నిన్న, మొన్నటి వరకూ తక్కువగా ఉన్నప్పటికీ ఈరోజు అమాంతం పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల హెచ్చు, తగ్గుదలకు కారణం అవుతోంది.
నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 61,800 కాగా ఈరోజు తులంపై రూ. 1000 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ. 62,890 కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 56,650 ఉండగా ఈరోజు. రూ.57,650 కి చేరింది. ఈవారం మొత్తం ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక వెండి విషయానికొస్తే నిన్నమన్నటి వరకూ 76 నుంచి 77 వేల మధ్య ఉన్న ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈరోజు కిలోపై ఏకంగా 2,500 పెరిగి 79,500 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..