Gold Price: పండుగ వేళ పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..

బంగారానికి డిమాండ్ మామూలుగా ఉండదు. అది ఏ కాలంలో అయినా మంచి విలువ కలిగి ఉంటుంది. వీటి ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో ఎవరూ చెప్పలేరు. బంగారం ధరలు నిన్న మొన్నటి వరకు తక్కువగా ఉన్నప్పటికీ గత రెండు రోజుల్లో అమాంతం పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలతో పాటు ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Gold Price: పండుగ వేళ పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
Gold Price

Updated on: Jan 14, 2024 | 6:15 AM

బంగారానికి డిమాండ్ మామూలుగా ఉండదు. అది ఏ కాలంలో అయినా మంచి విలువ కలిగి ఉంటుంది. వీటి ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో ఎవరూ చెప్పలేరు. బంగారం ధరలు నిన్న మొన్నటి వరకు తక్కువగా ఉన్నప్పటికీ గత రెండు రోజుల్లో అమాంతం పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలతో పాటు ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల హెచ్చు, తగ్గుదలకు కారణం అవుతోంది.

నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ. 62,950 కాగా ఈరోజు మరో రూ. 320 పెరిగి రూ.63,270కు చేరుకుంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,700 ఉండగా ఈరోజు రూ. 300 ఎగబాకి రూ.58,000 కి చేరుకుంది. ఈవారం మొత్తం ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. జనవరి మొదటి వారం నుంచి ఇప్పటి వరకు 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,000 నుంచి రూ.63,000 మధ్య ఊగిసలాడుతోంది. అదే 22 క్యారెట్ల పసిడి విషయానికొస్తే.. రూ. 57,000 నుంచి రూ.58,000 మధ్య కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే నిన్నమొన్నటి వరకు రూ. 77,500 వద్ద ఉన్న ధరలు.. ఏకంగా కిలోపై రూ. 500 పెరిగి రూ. 78,000 కి చేరింది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 63,270
  • విజయవాడ..రూ. 63,270
  • ముంబాయి..రూ. 63,270
  • బెంగళూరు..రూ. 63,270
  • చెన్నై..రూ. 63,760

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 58,000
  • విజయవాడ..రూ. 58,000
  • ముంబాయి..రూ. 58,000
  • బెంగళూరు..రూ. 58,000
  • చెన్నై..రూ.58,450

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్..రూ. 78,000
  • విజయవాడ..రూ. 78,000
  • చెన్నై..రూ. 78,000
  • ముంబాయి..రూ. 76,500
  • బెంగళూరు..రూ. 73,250

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us